తెలుగు న్యూస్  /  National International  /  I-t Dept Conducts Pan-india Raids Against Unrecognised Political Parties, Linked Funding

I-T raids unrecognised parties: గుర్తింపు లేని పార్టీలపై ఐడీ దాడులు

HT Telugu Desk HT Telugu

07 September 2022, 10:38 IST

  • I-T raids unrecognised parties: రిజిస్టర్ అయి ఉండి గుర్తింపు లేని రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది.

గుర్తింపు లేని రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ఐటీ సోదాలు
గుర్తింపు లేని రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ఐటీ సోదాలు (MINT_PRINT)

గుర్తింపు లేని రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ఐటీ సోదాలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 7: రిజిస్టర్ అయి ఉండి గుర్తింపు లేని రాజకీయ పార్టీల (ఆర్‌యుపిపి)పై పన్ను ఎగవేత విచారణలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ బుధవారం పలు రాష్ట్రాల్లో దాడులు ప్రారంభించిందని అధికారిక వర్గాలు తెలిపాయి.

ట్రెండింగ్ వార్తలు

Crime news : 8ఏళ్ల బాలిక రేప్​- హత్య.. నిందితుడి వయస్సు 13ఏళ్లు!

Prajwal Revanna : కర్ణాటకను కుదిపేస్తున్న సెక్స్​ కుంభకోణం.. దేశాన్ని విడిచి వెళ్లిపోయిన రేవన్న!

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, మరికొన్ని రాష్ట్రాల్లో సోదాలు జరుగుతున్నాయని ఆ వర్గాలు తెలిపాయి.

రిజిస్టర్ అయి ఉండి గుర్తింపు లేని రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ సంస్థలు, ఆపరేటర్లు, ఇతరులపై ఆదాయ పన్ను శాఖ ఈ చర్య ప్రారంభించిందని వర్గాలు తెలిపాయి.

ఫిజికల్ వెరిఫికేషన్ సమయంలో ఉనికిలో లేవని తేలిన తర్వాత ఇటీవల తన ఆర్‌యూపీపీ జాబితా నుండి 87 పార్టీలను కొట్టివేసిన ఎన్నికల కమిషన్ సిఫార్సు మేరకు ఆదాయ పన్ను శాఖ ఈ సోదాలు చేస్తున్నట్టు అవగతమవుతోంది.

నగదు విరాళాల వెల్లడికి సంబంధించిన నిబంధనలను, ఎన్నికల చట్టాలను ఉల్లంఘించినందుకు, వారి చిరునామా, ఆఫీస్ బేరర్‌ల పేర్లను అప్‌డేట్ చేయడంలో విఫలమైనందుకు 2,100 కంటే ఎక్కువ గల గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై చర్య తీసుకుంటున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఈ పార్టీలలో కొన్ని తీవ్రమైన ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నాయని పేర్కొంది.

టాపిక్