ఆదాయపు పన్ను పోర్టల్‌లో ఈ-ఫైలింగ్ పాస్‌వర్డ్‌ను ఎలా రీసెట్ చేయాలి?
ఆదాయపు పన్ను వెబ్‌సైట్ లాగిన్ కోసం మీ పాస్‌వర్డ్‌ను మీ ఆధార్ నెంబరును ఉపయోగించి లేదా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్‌ని అప్‌లోడ్ చేసి లేదా ఈ-ఫైలింగ్ OTPని ఉపయోగించి మూడు పద్ధతుల్లో రీసెట్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేసేటపుడు లాగిన్ అయ్యేందుకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ తప్పక ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాస్‌వర్డ్‌ను తప్పుగా ఎంటర్ చేస్తున్నా లేదా మర్చిపోయి ఉంటే మీ పాస్‌వర్డ్‌ను సులభంగా రీసెట్ చేసుకోవచ్చు. చాలాకాలంగా ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించకుండా అప్పుడప్పుడు పాస్‌వర్డ్‌ను మారుస్తుండటం కూడా భద్రతాపరంగా శ్రేయస్కరం.
ఇక నూతన ఆదాయపు పన్ను వెబ్‌సైట్ లాగిన్ కోసం మీ పాస్‌వర్డ్‌ను మీ ఆధార్ నెంబరును ఉపయోగించి లేదా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్‌ని అప్‌లోడ్ చేసి లేదా ఈ-ఫైలింగ్ OTPని ఉపయోగించి మూడు పద్ధతుల్లో రీసెట్ చేసుకోవచ్చు.
అయితే మీ కొత్త పాస్‌వర్డ్‌ను సృష్టించేటప్పుడు ముందుగా కొన్ని మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుంది.
అవేంటంటే..
- మీ పాస్‌వర్డ్ కనీసం 8 అక్షరాల పొడవు ఉండాలి, అలాగే 14 అక్షరాలకు మించి పొడవు ఉండకూడదు.
- పాస్‌వర్డ్‌లో పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు (స్మాల్, క్యాపిటల్ లెటర్స్) రెండూ ఉండేలా చూసుకోవాలి.
- అక్షరాలతో పాటు ఏదైనా ఒక నెంబరును కూడా జతచేయాలి
- వీటన్నిటితో పాటు పాస్‌వర్డ్‌లో ప్రత్యేక అక్షరం (ఉదా. @#$%) కూడా మీ కూర్పులో ఉండాలి.
- ఉదాహరణకు మీ పాస్‌వర్డ్ Hyderabad అనుకుంటే పైమార్గదర్శకాల ప్రకారం పాస్‌వర్డ్ రూపం Hyderabad@1 లేదా HYDerab@d1$ ఇలా కూడా ఉండొచ్చు.
ఆధార్ OTPని ఉపయోగించి పాస్‌వర్డ్‌ని రీసెట్ చేయడం ఎలా?
స్టెప్ 1: ITR ఈ-ఫైలింగ్ హోమ్‌పేజీకి వెళ్లి లాగిన్ క్లిక్ చేయండి.
స్టెప్ 2: మీ యూజర్ IDని నమోదు చేసి, కంటిన్యూపై క్లిక్ చేయండి.
స్టెప్ 3: పాస్‌వర్డ్‌ను నమోదు చేసే బాక్స్ కింద Forgot Password? అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
స్టెప్ 4: ఇప్పుడు మరొక పేజీ ఓపెన్ అవుతుంది, ఇక్కడ మరొకసారి యూజర్ IDని నమోదు చేసి, కంటిన్యూపై క్లిక్ చేయండి.
స్టెప్ 5: పాస్‌వర్డ్ రీసెట్ కోసం ఇచ్చిన ఆప్షన్లలో 'ఆధార్ OTP' ఆప్షన్ ఎంచుకొని, కంటిన్యూ క్లిక్ చేయండి
స్టెప్ 6: జెనరేట్ ఆధార్ OTP ఆప్షన్ ఆధారంగా కంటిన్యూ చేయండి
స్టెప్ 7: మీ ఆధార్-రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు 6-అంకెల OTP వస్తుంది, దానిని “వెరిఫై యువర్ ఐడెంటిటీ” పేజీలో వెరిఫై చేయండి.
దశ 8: వెరిఫై యువర్ ఐడెంటిటీ పేజీలో, డిక్లరేషన్ చెక్‌బాక్స్‌ని ఎంచుకుని, ఆధార్ OTPని క్లిక్ చేయండి.
స్టెప్ 9: ఇప్పుడు రీసెట్ పాస్‌వర్డ్ పేజీలో మీ కొత్త పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, దానిని మరొ బాక్సులో కన్ఫర్మ్ చేసి, సబ్మిట్‌పై క్లిక్ చేయండి.
అంతే మీకొత్త పాస్‌వర్డ్ అమలులోకి వచ్చినట్లే. మీరు మీ పాస్‌వర్డ్‌ను విజయవంతంగా మార్చుకున్నట్లు మెసేజ్, ఈ మెయిల్ వస్తుంది. ఒకవేళ ఓటీపీ రావడంలో సమస్యలు ఎదురైతే దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లి పరిష్కరించుకోవచ్చు.
Watch This Video for How to Reset Password:
మిగతా రెండు పద్ధతుల్లో కూడా దాదాపు ప్రక్రియ అంత ఇలాగే ఉంటుంది. ఈ-ఫైలింగ్ OTP ఆప్షన్ ఎంచుకుంటే మరింత సింపుల్. మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఎంటర్ చేస్తే మీ మొబైల్, ఈ-మెయిల్ అడ్రసుకు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేసి ప్రక్రియ పూర్తి చేయవచ్చు. అయితే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ఎంచుకుంటే మీ సంతకానికి సంబంధించిన ప్రూఫ్ డిజిటల్ కాపీని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం