CAPF Exam in regional languages: ఇక 13 ప్రాంతీయ భాషల్లో కూడా కానిస్టేబుల్ పరీక్ష
CAPF Exam in regional languages: సీఏపీఎఫ్ కానిస్టేబుల్ (CAPF constable) పరీక్షలను ఇకపై ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
CAPF Exam in regional languages: CRPF సహా సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్ (CAPF) లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) (CAPF constable (general duty)) ఉద్యోగ భర్తీ పరీక్షను ఇకపై ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ఆదేశాల మేరకు ఈ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో అన్ని రాష్ట్రాల స్థానిక యువతకు స్థానం కల్పిండంతో పాటు, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడం అమిత్ షా ఉద్దేశమన్నారు.
CAPF Exam in regional languages: సీఏపీఎఫ్ లో ఏముంటాయి..?
కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (CAPF) ప్రధానంగా సీఆర్పీఎఫ్ (Central Reserve Police Force CRPF), బీఎస్ఎఫ్(Border Security Force BSF), సీఐఎస్ఎఫ్ (Central Industrial Security Force CISF), ఐటీబీపీ (Indo-Tibetan Border Police ITBP)), ఎస్ఎస్ బీ (Sashastra Seema Bal SSB), ఎన్ఎస్ జీ (National Security Guard NSG) దళాలు ఉంటాయి. ఇకపై ఈ సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం జరిపే పరీక్షలను ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహిస్తారు. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు సీఏపీఎఫ్ (CAPF) కానిస్టేబుల్ పరీక్షల ప్రశ్నపత్రం ఇకపై తెలుగు (Telugu) అస్సామీస్(Assamese), బెంగాలీ(Bengali), గుజరాతీ (Gujarati), మరాఠీ (Marathi), మళయాలం(Malayalam), కన్నడ(Kannada), తమిళం (Tamil), ఒడియా(Odia), ఉర్దూ(Urdu), పంజాబీ (Punjabi), మణిపురి (Manipuri), కొంకణి(Konkani) భాషల్లోనూ ఉంటుంది. తమకు నచ్చిన భాషను అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు.
CAPF Exam in regional languages: రాజకీయ దుమారం
ఇటీవల విడుదల అయిన సీఆర్పీఎఫ్ (CRPF) కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లో ప్రాంతీయ భాషల్లో ఆ పరీక్షను రాసే అవకాశం ఇవ్వకపోవడంపై రాజకీయంగా దుమారం చెలరేగింది. ఇంగ్లీష్, లేదా హిందీల మాత్రమే ఈ పరీక్ష రాసే అవకాశం కల్పించడంపై కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ (BRS), డీఎంకే (DMK) వంటి పలు ప్రాంతీయ పార్టీలు విమర్శలు గుప్పించాయి. తమిళంలో కూడా ఈ రాత పరీక్షను నిర్వహించాలని డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం స్టాలిన్ (MK Stalin) కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈఆర్పీఎఫ్ సహా అన్ని సీఏపీఎఫ్ కానిస్టేబుల్ పరీక్షలను ఇకపై అన్ని ప్రధాన ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.