Madhya Pradesh : 75 ఏళ్ల అమ్మమ్మపై పాశవికంగా దాడి, వీడియో వైరల్ - దంపతులు అరెస్ట్
Madhya Pradesh Crime News: భోపాల్ లో ఓ వృద్ధురాలిని చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడ్డ దంపతులను అరెస్ట్ చేశారు.
Madhya Pradesh News: 75 ఏళ్ల వృద్ధురాలిపై అత్యంత పాశవికంగా దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్ లోని(Madhya Pradesh) భోపాల్ లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. విషయం కాస్త… పోలీసుల వరకు చేరింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన….నిందితులైన దంపతులను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
బార్ ఖేడికి చెందిన దీపక్ సేన్ ను నిందితుడిగా గుర్తించారు పోలీసులు. అతని భార్య పుజా సేన్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై భోపాల్(Bhopal) డిప్యూటీ కమిషనర్ ప్రియాంకా శుక్లా మాట్లాడుతూ…."రెండు రోజుల క్రితం ఒక వ్యక్తి మరియు ఒక మహిళ వృద్ధురాలిపై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మా దృష్టికి రావటంతో… నిందితులను అరెస్ట్ చేశారు. దాడికి పాల్పడిన వారిని దీపక్ సేన్ మరియు అతని భార్య పూజా సేన్‌గా గుర్తించారు.దాడికి గురైన వృద్ధురాలి దీపక్ సేన్ అమ్మమగా గుర్తించాం" అని చెప్పారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. వారిని గురువారం జైలుకు పంపినట్లు పోలీసు అధికారి శుక్లా తెలిపారు. “వృద్ధ మహిళ ఝాన్సీ… అతని మనువడైన దీపక్ సేన్ వద్ద ఉంటుంది. ఈ దాడి ఘటన మార్చి 21 -22 తేదీల్లో జరిగింది. మార్చి 26వ తేదీ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వృద్ధురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు తీవ్ర గాయాలైనట్లు తేలింది. ఆమె వాంగ్మూలం ఆధారంగా…. కేసులో పలు సెక్షన్లను జోడించాం” అని వివరించారు.
దాడికి గల కారణాలపై డీసీపీ శుక్లా మాట్లాడుతూ… ఆస్తి వివాదంతో పాటు పలు సమస్యలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఈ ఘటనను చిత్రీకరించిన వ్యక్తిని( ఇంటి యాజమాని) కేసులో సాక్షిగా చేర్చామని పేర్కొన్నారు. ఇక బాధితిరాలు స్పందిస్తూ… తన మనవడితో పాటు అతని భార్య… గత రెండు మూడు నెలలుగా ఇలాగే కొడుతున్నారని చెప్పారు.