Barrelakka Marriage : పెళ్లిపీటలెక్కబోతున్న బర్రెలక్క, ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్-వాళ్లకు వార్నింగ్!-kollapur barrelakka marriage pre wedding shoot viral in social media ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Kollapur Barrelakka Marriage Pre Wedding Shoot Viral In Social Media

Barrelakka Marriage : పెళ్లిపీటలెక్కబోతున్న బర్రెలక్క, ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్-వాళ్లకు వార్నింగ్!

Bandaru Satyaprasad HT Telugu
Mar 27, 2024 10:04 PM IST

Barrelakka Marriage : బర్రెలక్క మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ నెల 28న బర్రెలక్క వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుంది.

పెళ్లిపీటలెక్కబోతున్న బర్రెలక్క
పెళ్లిపీటలెక్కబోతున్న బర్రెలక్క

Barrelakka Marriage : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సంచలనం రేపిన బర్రెలక్క (Barrelakka)అలియాస్ శిరీష పెళ్లి పీటలెక్కబోతున్నారు. బర్రెలక్క పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బర్రెలక్క... ఉద్యోగం లేక బర్రెలు కాస్తున్నా అంటే ఆ మధ్య సోషల్ మీడియా షేక్ చేసిన శిరీష అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేసేందుకే ఎన్నికల్లో పోటీ చేసినట్లు ఆమె తెలిపారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలైంది. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బర్రెలక్క 5,754 ఓట్లతో నాల్గో స్థానంలో నిలిచింది. బర్రెలక్కకు ఇద్దరు తమ్ముళ్లు, తల్లి ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసిన బర్రెలక్క తల్లికి సాయంగా ఉంటూ ఓపెన్ డిగ్రీ చేస్తుంది. తాజాగా ఆమెకు పెళ్లి కుదిరింది. ఈ విషయాన్ని ఆమె ఇన్ స్టాగ్రామ్ (Instagram)వేదికగా పంచుకుంది. తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్‌ చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

బర్రెలక్క వీడియో వైరల్

ఉద్యోగ నోటిఫికేషన్లు లేక బర్రెలు కాస్తున్నా అంటూ సోషల్ మీడియాలో సంచలనం రేపిన శిరీష తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యింది. ఆ వీడియో బర్రెలక్కగా మారిపోయింది. తరచూ సోషల్ మీడియాలో(Social Media) వీడియోలు పోస్టు చేస్తుండేది బర్రెలక్క. నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ వీడియోలు చేసేది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని బర్రెలక్క ప్రకటించింది. ఇంతలోనే పెళ్లిపీటలెక్కబోతున్నాయని మరో న్యూస్ చెప్పింది. శిరీష పోస్టు చేసిన వీడియో ప్రకారం వివాహ బంధంలోకి (Barrelakka Wedding)అడుగుపెట్టనుందని తెలుస్తోంది. పెళ్లికొడుకు పేరు వెంకటేష్ అని తెలిపింది.

యూట్యూబ్ ఛానల్స్ కు వార్నింగ్

బర్రెలక్క ఈ నెల 28న వెంకటేష్ అనే యువకుడిని వివాహం (Barrelakka Marriage)చేసుకుంటుంది. నాగర్ కర్నూల్ కు చెందిన వెంకటేష్‌ను పెళ్లి చేసుకుంటున్నానని బర్రెలక్క మరోసారి సోషల్ మీడియా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో శిరీష్ ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్(Pre Wedding Photo Shoot) వీడియోలు పోస్టు చేసింది. ఇవి వైరల్ అవుతున్నాయి. ఈ ప్రీ వెడ్డింగ్ కోసం స్పెషల్ సాంగ్ ఓ శిరీష.. నా శిరీష అంటూ సాగిపోతుంది. అయితే ఈ సాంగ్ ను అనిత..నా అనిత సింగర్ నాగరాజు పాడారు. కొందరు ఈ సాంగ్ ను డౌన్ లోడ్ చేసి వారి యూట్యూబ్ ఛానళ్లలో(YouTube Channels) పోస్టు చేశారు. దీనిపై బర్రెలక్క సీరియస్ అయ్యింది. వాళ్లకు వార్నింగ్ కూడా ఇచ్చింది.

WhatsApp channel

సంబంధిత కథనం