The Railway Men OTT Web series: భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రానుందంటే!-the railway men netflix ott web series teaser released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Railway Men Ott Web Series: భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రానుందంటే!

The Railway Men OTT Web series: భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రానుందంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 08, 2024 06:23 PM IST

The Railway Men OTT Web series Teaser: భోపాల్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటన ఆధారంగా ఓ వెబ్ సిరీస్ వస్తోంది. ది రైల్వే మెన్ పేరుతో ఇది రానుంది. ఈ సిరీస్ టీజర్ నేడు రిలీజ్ అయింది. వివరాలివే..

The Railway Men OTT Web series: భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్
The Railway Men OTT Web series: భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్

The Railway Men OTT Web series Teaser: భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన దేశంలో మహా విషాదాన్ని రేపింది. 1984 డిసెంబర్ 2వ తేదీన జరిగిన ఈ గ్యాస్ లీకేజీ వేలాది మంది ప్రాణాలను బలిగొంది. అత్యంత మహా విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటన ఆధారంగా ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ రూపొందుతోంది. ‘ది రైల్వే మెన్’ పేరుతో ఈ వెబ్ సిరీస్ వస్తోంది. మాధవన్‍, కేకే మీనన్, బాబిల్ ఖాన్, దివ్యేందు ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషించారు. శివ్ రావలి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ‘ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్ టీజర్ నేడు (అక్టోబర్ 28) రిలీజ్ అయింది.

yearly horoscope entry point

భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనను కళ్లకు కట్టేలా ‘ది రైల్వే మెన్’ టీజర్లో విజువల్స్ ఉన్నాయి. ఆద్యంతం గుండె వేగాన్ని పెంచేలా టీజర్ ఉంది. భోపాల్ దుర్ఘటనలో వేలాది మంది ప్రాణాలను కాపాడిన నలుగురు రైల్వే ఉద్యోగుల కృషి గురించి ఈ సిరీస్ రూపొందింది. భోపాల్ రైల్వే స్టేషన్ కేంద్రంగా ఈ ‘ది రైల్వే మెన్’ సిరీస్ ఉంది. వాస్తవ ఘటన ఆధారంగా రూపొందింది.

‘ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్ నవంబర్ 18వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. మొత్తంగా నాలుగు ఎపిసోడ్లు ఉండనున్నాయి. ఈ విషయాన్ని నెట్‍ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. “దేశాన్ని మొత్తం విషాదంలో నింపిన ఒక రాత్రి.. నలుగురు వీరులు అవిశ్రాంతంగా పోరాడారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన ‘ది రైల్వే మెన్’ నాలుగు ఎపిసోడ్లలో నవంబర్ 18వ తేదీన వస్తోంది” అని నెట్‍ఫ్లిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. టీజర్‌ను నేడు రిలీజ్ చేసింది.

‘ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్‍ను యశ్ రాజ్ ఫిల్మ్స్ ఎంటర్‌టైన్‍మెంట్స్ నిర్మించగా.. శివ్ రవాలీ దర్శకత్వం వహించారు. ఆయుష్ గుప్తా రచయితగా వ్యవహరించారు.

Whats_app_banner