తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pet Insurance : పెంపుడు శునకాల కోసం 'బీమా' పాలసీ వచ్చేసింది!

Pet Insurance : పెంపుడు శునకాల కోసం 'బీమా' పాలసీ వచ్చేసింది!

Sharath Chitturi HT Telugu

01 August 2022, 16:34 IST

    • Pet Insurance India: పెంపుడు శునకాలకు కూడా బీమా ఉంటే ఎలా ఉంటుంది? దేశంలో ఇలాంటి బీమానే వచ్చేసింది. వివరాల్లోకి వెళితే..
పెంపుడు శునకాల కోసం బీమా వచ్చేసింది
పెంపుడు శునకాల కోసం బీమా వచ్చేసింది (Mint)

పెంపుడు శునకాల కోసం బీమా వచ్చేసింది

Pet Insurance India: ఇప్పుడు దేశంలో పెంపుడు శునకాలకు కూడా బీమా లభిస్తోంది! పెంపుడు శునకాలకు బీమాను తీసుకొచ్చేందుకు.. ఫ్యూచర్​ జెనెరలి ఇండియా అనే ఇన్ష్యూరెన్స్​ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది స్టార్ట్​అప్​ సంస్థ ఇన్ష్యూరెన్స్​దేఖో. మరిన్ని బీమా సంస్థలతో కూడా టైఅప్​ అవ్వడానికి ప్రణాళికలు రచిస్తోంది ఈ ఇన్ష్యూరెన్స్​దేఖో.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

పెంపుడు శునకాల బీమా ప్రిమియం.. వార్షికంగా రూ. 324తో మొదలవుతుంది. 6- 10ఏళ్ల వయస్సున్న 25 శునక జాతులకు ఈ బీమా వర్తిస్తుంది. ఈ బీమాతో పెంపుడు శునకాలను పెంచుకుంటున్న వారికి ఆర్థిక సాయం అందుతుంది. శునకాలకు ఆసుపత్రిలో చికిత్స, సర్జరీ వంటివి ఈ బీమా పాలసీలో ఉన్నాయి.

అయితే.. ఈ బీమాను పొందాలనుకునే వారు.. టర్మ్స్​ అండ్​ కండీషన్​ను క్షుణ్నంగా చదివిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

"శునకాలకు మనుషులకు అత్యంత దగ్గర బంధం ఉంది. కుక్కలు కూడా రోగాల బారిన పడతాయి. అందుకే పెట్​ ఇన్ష్యూరెన్స్​ తీసుకొచ్చాము. పెంపుడు శునకాల తల్లిదండ్రులకు ఇది ఉపయోగపడుతుంది. దేశంలో 32మిలియన్​ పెంపుడు జంతువులు ఉన్నాయి. ఈ సంఖ్య ఏటా 12శాతం పెరుగుతోంది. ఇందులో శునకాల జనాభానే 85శాతం ఉంది. అందువల్ల పెంపుడు శునకాల కోసం ఏర్పాటు చేసిన ఈ బీమాకు ఆదరణ లభిస్తుందని భావిస్తున్నాము," అని ఇన్ష్యూరెన్స్​ దేఖో సీఈఓ, సహ వ్యవస్థాపకుడు అంకిత్​ అగర్వాల్​ వెల్లడించారు.

ఇండియాలో 2022 చివరి నాటికి.. ఈ పెంపుడు శునకాల బీమా వ్యాపారం.. 14శాతం పెరిగి 490మిలియన్​ డాలర్లకు చేరుతుందని అంచనా. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాపారం 32.7బిలియన్​ డాలర్లకు వెళుతుందని భావిస్తున్నారు.

టాపిక్