తెలుగు న్యూస్ / ఫోటో /
Pet Care Tips | ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నాయా.. వాటికి ఈ శిక్షణ తప్పనిసరి!
- వ్యక్తులకు నిరంతర ప్రాతిపదికన వ్యాయామాలు చేయడం, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం లాంటివి సాధన చేయాల్సిన అవసరం ఉన్నట్లుగానే వారు పెంచుకుంటున్న పెంపుడు జంతువులకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అయితే పెంపుడు జంతువులకు తప్పనిసరిగా అవసరమయ్యే కొన్ని ప్రాథమిక శిక్షణా కార్యకలాపాలు ఇక్కడ తెలుసుకోండి.
- వ్యక్తులకు నిరంతర ప్రాతిపదికన వ్యాయామాలు చేయడం, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం లాంటివి సాధన చేయాల్సిన అవసరం ఉన్నట్లుగానే వారు పెంచుకుంటున్న పెంపుడు జంతువులకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అయితే పెంపుడు జంతువులకు తప్పనిసరిగా అవసరమయ్యే కొన్ని ప్రాథమిక శిక్షణా కార్యకలాపాలు ఇక్కడ తెలుసుకోండి.
(1 / 9)
చాలా మందికి పెంపుడు జంతువులు కూడా వారి కుటుంబంలో భాగమే. ప్రజలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు, పెంపుడు జంతువుల ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి. వాటికి కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయాలి. పెంపుడు జంతువులకు ఒకసారి మంచి జీవనశైలిని అలవాటు చేస్తే వాటంతటవే ప్రతిరోజూ అనుసరిస్తాయి.(Bethany Ferr)
(2 / 9)
జిగ్లీలో బిజినెస్ హెడ్ అయిన అంబరీష్ సికార్వార్ పెంపుడు జంతువులకు తప్పనిసరిగా కొన్ని ప్రాథమిక శిక్షణలు ఇవ్వాలి అని తెలిపారు. ఇవి వాటి స్వయం సమృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. పెంపుడు జంతువుల కోసం ఆయన కొన్ని శిక్షణా కార్యకలాపాలను పంచుకున్నారు:(Arina Krasnikova)
(3 / 9)
స్లీపింగ్ అలవాట్లు , విశ్రాంతి సమయం: ఏ జీవికైనా నిర్ణీత సమయం పాటు నిద్ర, విశ్రాంతి ఉండాలి. పెంపుడు జంతువులు సాధారణంగా రోజంతా చురుకుగా ఉంటాయి. ఇది అలసటకు దారితీస్తుంది. చివరికి వాటి పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి వాటికంటూ విశ్రాంతి సమయం కేటాయించాలి. ఆ సమయంలో ఎలాంటి కార్యకలాపాలు ఇవ్వకూడదు. సమయం ప్రకారం నిద్రను అలవాటు చేయాలి.(Photo by BRUNO EMMANUELLE on Unsplash)
(4 / 9)
2. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు: పెంపుడు జంతువులు ఏది పడితే అది తినకుండా పరిమితులు విధించాలి. పెంపుడు జంతువులకు మనుషులు తినే ఆహారాలు ఇవ్వకూడదు. పశువైద్యుడు సూచించిన పెంపుడు జంతువుల ఆహారాన్ని మాత్రమే అందించాలి. వాటికి కూడా సరైన డైట్ చార్ట్ ఉండాలి. అప్పుడే ఎలాంటి రోగాలబారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటాయి.(Pixabay)
(5 / 9)
3. స్నేహపూర్వకమైన శిక్షణ - చాలా సందర్భాలలో కొన్ని పెంపుడు జంతువులు ఇతర పెంపుడు జంతువులతో కలిసి ఉండలేవు. వాటి రాకను ఆహ్వానించవు. కొన్ని సార్లు హింసాత్మకంగా ప్రవర్తిస్తాయి. కాబట్టి వాటిని అన్నింటితో కలిసిపోయేలా శిక్షణ ఇవ్వాలి. ఇది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. కాబట్టి ఓపికగా శిక్షణను ఇవ్వాల్సి ఉంటుంది. కొంత సమయం పడుతుంది.(Helena Lopes)
(6 / 9)
శారీరక శ్రమ - ఏ పెంపుడు జంతువుకు అయినా శారీరక శ్రమ లేకపోతే బద్ధకంగా తయారవుతాయి. ప్రతిరోజూ వాటికి నడక కల్పించాలి. కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ అలవాటు చేయాలి. లేకపోతే వాటి మానసిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపి విచిత్రంగా ప్రవర్తిస్తాయి.(Image by Darío Jarrín from Pixabay )
(7 / 9)
దూకుడు తగ్గించాలి - కొన్ని పెంపుడు జంతువులు ప్రత్యేకంగా కుక్కలు కొత్త వ్యక్తులను కలిసినప్పుడు వారిపైకి దూకే ధోరణిని కలిగి ఉంటాయి. ఇది కొన్నిసార్లు వ్యక్తులపై ప్రేమను చూపించే సంకేతం అయినప్పటికీ, పెంపుడు జంతువులకు అలాంటి ప్రవర్తనను నియంత్రించడానికి శిక్షణ ఇవ్వాలి. కొంతమంది అలాంటి ప్రవర్తనను స్వాగతించకపోవచ్చు. అలాగే మరికొన్ని చెంగుచెంగున దూకుతూ ఇంట్లో విలువైన వస్తువులను ధ్వంసం చేస్తాయి. వీటిని నియంత్రించాలి.(Yunus Tuğ)
(8 / 9)
పెంపుడు జంతువులను ప్రేమగా చూసుకోవాలి. ప్రేమను పంచాలి. వాటిపై కఠిన వైఖరి చూపకూడదు. స్నేహపూర్వకంగా మెలిగేలా శిక్షణ ఇవ్వాలి.
ఇతర గ్యాలరీలు