తెలుగు న్యూస్  /  National International  /  Instagram Is Internally Testing A New Monetization Feature For Creators Called 'Gifts'

Insta: ‘ఇన్ స్టా’ లో కొత్త ఫీచర్ ‘గిఫ్ట్స్’. దీంతో సంపాదించవచ్చు క్రియేటివ్ గా

HT Telugu Desk HT Telugu

14 September 2022, 21:30 IST

    • Instagram monetization feature: తన క్రియేటివ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది సోషల్ మీడియా దిగ్గజం ‘ఇన్ స్టాగ్రామ్’. ప్రస్తుతం ఈ మానెటైజేషన్ ఫీచర్ ప్రయోగ దశలో ఉంది. ‘గిఫ్ట్స్’ అనే ఈ ఫీచర్ ద్వారా క్రియేటర్లు తమ రీల్స్ ద్వారా సంపాదించవచ్చు.
ఇన్ స్టాగ్రామ్ లోగో
ఇన్ స్టాగ్రామ్ లోగో

ఇన్ స్టాగ్రామ్ లోగో

Instagram monetization feature: అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతానికి అంతర్గత ప్రొటోటైప్ గా ప్రయోగ దశలో ఉందని, ఎక్స్ టర్నల్ టెస్టింగ్ కు ఇంకా సమయం ఉందని ఇన్ స్టాగ్రామ్ యాజమాన్య సంస్థ `మెటా` ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

Crime news : 8ఏళ్ల బాలిక రేప్​- హత్య.. నిందితుడి వయస్సు 13ఏళ్లు!

Prajwal Revanna : కర్ణాటకను కుదిపేస్తున్న సెక్స్​ కుంభకోణం.. దేశాన్ని విడిచి వెళ్లిపోయిన రేవన్న!

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

Instagram monetization feature: కంటెంట్ అప్రీసియేషన్ పేరుతో..

మొదట జులై నెలలో ఒక యాప్ రీసెర్చర్ అలెసాండ్రో పాలుజీ ఈ ఫీచర్ ను గుర్తించాడు. ఆ సమయంలో ఇన్ స్టాగ్రామ్ ఈ ఫీచర్ ను కంటెంట్ అప్రీసియేషన్ పేరుతో డెవలప్ చేస్తోంది. పాలుజీ తీసిన స్క్రీన్ షాట్స్ ఆధారంగా ఈ ఫీచర్ పనితీరును విశ్లేషించారు. ఈ ఫీచర్ ప్రకారం.. రీల్స్ క్రియేటర్స్ కు ఒక ఆప్షన్ ను ఇస్తారు. దాని ద్వారా వారు తమ ఫాలోవర్ల నుంచి గిఫ్ట్స్ ను పొందవచ్చు. రీల్ క్రియేటర్లు తాము ఈ ఫీచర్ కు అర్హులమా? కాదా? అనే విషయాన్ని సెట్టింగ్స్ లోని గిఫ్ట్స్ ట్యాబ్ ను పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. రీల్స్ అడుగున ఉన్న బటన్ ద్వారా యూజర్లు గిఫ్ట్స్ ను పంపించేలా అవకాశం కల్పించారు.

Instagram monetization feature: గతంలో కూడా..

గతంలోనూ ఇలాంటి ఫీచర్లను ఇన్ స్టాగ్రామ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. 2020లో `బ్యాడ్జెస్` ను యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా యూజర్లు తమకు నచ్చిన క్రియేటర్లకు లైవ్ వీడియో ద్వారా సపోర్ట్ చేయవచ్చు. ఈ బ్యాడ్జెస్ 0.99 డాలర్లు, 1.99 డాలర్లు, 4.99 డాలర్ల డినామినేషన్లలో ఉంటాయి. లైవ్ వీడియో ద్వారా మీకు నచ్చిన క్రియేటర్ కోసం ఈ బ్యాడ్జెస్ ను కొనుగోలు చేయవచ్చు. అలా పర్చేజ్ చేయగానే కామెంట్స్ సెక్షన్ లో మీ పేరు పక్కన హార్ట్ ఐకన్ కనిపిస్తుంది. గిఫ్ట్స్ ఆప్షన్ అందుబాటులోకి వస్తే.. లైవ్ వీడియో ద్వారా, రీల్స్ ద్వారా క్రియేటర్లు డబ్బు సంపాదించవచ్చు. ఇన్ స్టా రీల్స్ కు ప్రధాన పోటీ దారు అయిన టిక్ టాక్ గత డిసెంబర్ లోనే క్రియేటర్ల కోసం డైరెక్ట్ టిప్పింగ్ ఫెసిలిటీ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే, ట్విటర్ కూడా మే 2021 లో ఇలాంటి టిప్ జార్ ఫీచర్ నే తీసుకువచ్చింది.