తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India Successfully Tests Agni-3: అగ్ని 3 ప్రయోగం విజయవంతం

India successfully tests Agni-3: అగ్ని 3 ప్రయోగం విజయవంతం

HT Telugu Desk HT Telugu

23 November 2022, 23:09 IST

  • India successfully tests Agni-3 missile: స్ట్రాటెజిక్ ఫోర్సెస్ కమాండ్ సాధారణ విధుల్లో భాగంగా బుధవారం ఇంటర్మీడియెట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని 3’ని విజయవంతంగా ప్రయోగించింది.

అగ్ని 3 క్షిపణి
అగ్ని 3 క్షిపణి (HT File Photo)

అగ్ని 3 క్షిపణి

India successfully tests Agni-3: ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలండ్ నుంచి మధ్యంతర రేేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని 3’ ని బుధవారం ప్రయోగించారు. ఎంపిక చేసిన లక్ష్యాన్ని క్షిపణి విజయవంతంగా చేధించింది.

India successfully tests Agni-3: రక్షణ శాఖ ప్రకటన

‘అగ్ని 3’ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని రక్షణ శాఖ బుధవారం ప్రకటించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలండ్ నుంచి మధ్యంతర రేేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని 3’ ని విజయవంతంగా ప్రయోగించినట్లు వెల్లడించింది. స్ట్రాటెజిక్ ఫోర్సెస్ కమాండ్ సాధారణ విధుల్లో క్షిపణి ప్రయోగ శిక్షణలో భాగంగా ఈ ప్రయోగం నిర్వహించినట్లు వెల్లడించింది.

India successfully tests Agni-3: ‘అగ్ని 3’

అగ్ని క్షిపణి సిరీస్ లో ‘అగ్ని 3’ మూడవది. అగ్ని 3 ని మొదట 2006 జులైలో ప్రయోగించారు. కానీ ఆ ప్రయోగం విఫలమైంది. క్షిపణి లక్ష్యాన్ని చేధించకుండానే, ఒడిశా తీరంలో సముద్రంలో పడిపోయింది. ఆ తరువాత 2007లో తొలిసారి అగ్ని 3న విజయవంతంగా ప్రయోగించారు. అనంతరం, మూడోసారి 2008లోనూ విజయవంతంగా ప్రయోగించారు. అగ్ని 3 అణు వార్ హెడ్ ను మోసుకువెళ్లగలదు. అలాగే, 3500 కిమీల దూరంలోని లక్ష్యాన్ని చేధించగలదు.