తెలుగు న్యూస్  /  National International  /  Housing Prices Rise In 41 Cities Second Highest In Hyderabad In Fy22 Nhb Data Says

Housing prices rise: ఇళ్ల ధరల పెరుగుదల హైదరాబాద్‌లోనే అత్యధికం: ఎన్‌హెచ్‌బీ

HT Telugu Desk HT Telugu

12 July 2022, 18:32 IST

  • Housing prices rise: అహ్మదాబాద్ తరువాత ఇళ్ల ధరల పెరుగుదల హైదరాబాద్‌లోనే అత్యధికమని నేషనల్ హౌజింగ్ బ్యాంక్ డేటా స్పష్టం చేస్తోంది.

అహ్మదాబాద్ అనంతరం అత్యధికంగా హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు పెరిగాయి
అహ్మదాబాద్ అనంతరం అత్యధికంగా హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు పెరిగాయి (HT_PRINT)

అహ్మదాబాద్ అనంతరం అత్యధికంగా హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు పెరిగాయి

న్యూఢిల్లీ, జూలై 12: 2021-22 ఆర్థిక సంవత్సరంలో 41 నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయని, 5 నగరాల్లో రేట్లు తగ్గాయని, 4 నగరాల్లో మార్పు లేదని నేషనల్ హౌజింగ్ బ్యాంక్ ఆవిష్కరించిన రెసిడెక్స్ సూచీ వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

8 మెట్రో నగరాలలో ఇళ్ల ధరల పెరుగుదల ఇలా ఉంది. అహ్మదాబాద్‌లో 13.8 శాతం, హైదరాబాద్‌లో 11 శాతం, చెన్నైలో 7.7 శాతం, బెంగళూరులో 2.5 శాతం, ఢిల్లీలో 3.2 శాతం, కోల్‌కతాలో 2.6 శాతం, ముంబైలో 1.9 శాతం, పూణేలో 0.9 శాతం మేర ఇళ్ల ధరలు పెరిగాయని నేషనల్ హౌజింగ్ బ్యాంక్ సూచీ రెసిడెక్స్ నివేదించింది.

అత్యధికంగా అహ్మదాబాద్‌లో 13.8 శాతం పెరగగా, నవీ ముంబైలో 5.9 శాతం పతనమయ్యాయని, ఇళ్ల ధరల మార్పు రేంజ్‌ను విశ్లేషించింది.

జూన్ 2021 నుంచి ప్రతి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు పెరుగుతున్నాయని, కోవిడ్ అనంతరం హౌజింగ్ మార్కెట్ పుంజుకుంటోందనడానికి ఇది సంకేతమని సూచీ స్పష్టం చేస్తోంది.

క్వార్టర్ వారీగా ఇళ్ల ధరల ట్రెండ్‌ను తెలియపరుస్తూ ఎన్‌హెచ్‌బీ రెసిడెక్స్ సూచీని 2007 నుంచి వెల్లడిస్తోంది. తదుపరి 2017-18ని బేస్ ఇయర్‌గా నిర్దేశించింది.

అండర్ కన్‌స్ట్రక్షన్ ఇళ్లకు కూడా ధరలు 4.8 శాతం మేర పెరిగాయని, అండర్ కన్‌స్ట్రక్షన్, రెడీ టూ మూవ్ ప్రాజెక్టుల ధరలను పరిగణనలోకి తీసుకుని వీటి ధరలను మదింపు చేసినట్టు వెల్లడించింది.

టాపిక్