తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Housing Sales : వడ్డీ రేట్ల పెంపుతో ఫ్లాట్ల అమ్మకాలు ఢమాలే

Housing sales : వడ్డీ రేట్ల పెంపుతో ఫ్లాట్ల అమ్మకాలు ఢమాలే

08 June 2022, 12:37 IST

    • వడ్డీ రేట్ల పెంపుతో హౌజింగ్ సేల్స్ పడిపోతాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లు చెబుతున్నారు.
వడ్డీ రేట్ల పెంపుతో హౌజింగ్ సేల్స్‌పై ప్రభావం (ప్రతీకాత్మక చిత్రం)
వడ్డీ రేట్ల పెంపుతో హౌజింగ్ సేల్స్‌పై ప్రభావం (ప్రతీకాత్మక చిత్రం) (AFP)

వడ్డీ రేట్ల పెంపుతో హౌజింగ్ సేల్స్‌పై ప్రభావం (ప్రతీకాత్మక చిత్రం)

న్యూఢిల్లీ, జూన్ 8: ఆర్‌బీఐ రెపో రేటు పెంపు నిర్ణయం హౌజింగ్ సేల్స్‌పై ప్రభావం చూపనుంది. రెపో రేటు పెంపుతో హోమ్ లోన్లపై వడ్డీ రేట్లు పెరుగుతాయని, ముఖ్యంగా అఫర్డబుల్, మిడ్ ఇన్‌కమ్ సెగ్మెంట్లలో హౌజింగ్ సేల్స్ పడిపోతాయని ప్రాపర్టీ కన్సల్టెంట్లు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Patna crime news : స్కూల్​ డ్రైనేజ్​లో 4ఏళ్ల బాలుడి మృతదేహం.. నిరసనలతో తగలబడిన పాఠశాల!

JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర పెంచి 4.90 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.

ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థలు అనరాక్, నైట్ ఫ్రాంక్ ఇండియా, జేఎల్ఎల్ ఇండియా, కొలియర్స్ ఇండియా తదితర సంస్థలు  ఆర్‌బీఐ చర్యను ముందే ఊహించామని, హోం లోన్లపై వడ్డీ రేట్లలో పెరుగుదల హౌజింగ్ రంగంపై ప్రభావం చూపుతుందని తెలిపాయి.

అనరాక్ ఛైర్మన్ అనూజ్ పూరి మాట్లాడుతూ ‘రెపో రేటు పెంపు నిర్ణయం హోం లోన్లపై వడ్డీ రేట్లను పెంచుతుంది. గత నెలలో ఆర్‌బీఐ ఆకస్మిక పెంపు కారణంగా ఇప్పటికే వడ్డీ రేట్లు పెరగడం ప్రారంభమైంది..’ అని అన్నారు.

అయితే 2008 నాటి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ సమయంలో ఉన్న వడ్డీ రేట్ల కంటే కూడా ఇప్పుడు తక్కువగానే ఉన్నాయని, ఆ సమయంలో దాదాపు 12 శాతానికి వెళ్లాయని వివరించారు.

‘అయితే ప్రస్తుత పెంపు రానున్న కొన్ని నెలల్లో రెసిడెన్షియల్ సేల్స్ వాల్యూమ్స్‌పై ప్రభావం చూపుతుంది. మరీ ముఖ్యంగా అఫర్డబుల్, మిడ్ సెగ్మెంట్లలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది..’ అని వివరించారు. హౌజింగ్ మార్కెట్ల నడకను ఇప్పటికీ తుది వినియోగదారుడే నిర్ధేశిస్తాడని అన్నారు. 

‘ఇల్లు కొనాలన్న ప్రగాఢ ఆకాంక్ష ఉన్న వారి నుంచి మాత్రమే డిమాండ్ ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూసే వారు సాధ్యమైనంత తక్కువ ఎంట్రీ పాయింట్‌లోనే పెట్టుబడి పెడతారు..’ అని అభిప్రాయపడ్డారు. అయితే రెపో రేటు పెంపు అనివార్యమని అన్నారు.

‘అయితే ఇప్పుడు మనం రెడ్ జోన్‌లోకి వెళుతున్నాం. భవిష్యత్తులో పెరిగే వడ్డీ రేట్లు స్పష్టంగా హౌజింగ్ అమ్మకాలపై ప్రతిబింబిస్తాయి..’ అని అన్నారు.

కొలియర్స్ ఇండియా సీఈవో రమేష్ నాయర్ మాట్లాడుతూ బ్యాంకులు క్రమంగా ఈ రెపో రేటు పెంపును వినియోగదారులపై మోపుతారని, రానున్న నెలల్లో హోం లోన్లపై వడ్డీ రేట్లు పెరుగుతాయని అన్నారు.

అందువల్ల హోం లోన్ వడ్డీ రేట్లు పెరుగుతున్నందున తక్షణమే కొనుగోలు చేసుకొని ప్రయోజనం పొందాలని సూచించారు.

హౌజింగ్ డాట్ కామ్, ప్రాప్ ‌టైగర్ డాట్ కామ్‌ల సీఈవో ధ్రువ్ అగర్వాల్ మాట్లాడుతూ రెపో రేటు రెండుసార్లు పెంచడం అంతిమంగా హోం లోన్ వడ్డీ రేట్లను పైకి తీసుకెళుతుందని, ఇది కొనుగోలుదారిడి సెంటిమెంట్‌ను దెబ్బతీస్తుందని అన్నారు.

నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ మాట్లాడుతూ హోం లోన్ వడ్డీ రేట్లు మరింత పెరగనున్నాయని అన్నారు. పెరుగుతున్న ప్రాపర్టీ రేట్లకు తోడు వడ్డీ రేట్ల పెరుగుదల రియల్ ఎస్టేట్‌లో కొనుగోలుదారుల సెంటిమెంట్‌ను భారీగా దెబ్బతీస్తుందని విశ్లేషించారు.

ఇండియా సోత్‌బైస్ ఇంటర్నేషనల్ రియాల్టీ సీఈవో అమిత్ గోయల్ మాట్లాడుతూ హౌజింగ్ డిమాండ్‌పై దీని ప్రభావం కనిపించడం లేదని, డిమాండ్ పటిష్టంగా కొనసాగుతుందని అన్నారు.

ఈ సంవత్సరాంతానికి ద్రవ్యోల్భణం నెమ్మదిస్తుందని, దాంతో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

ఆర్ఈఐఎస్ ఇండియా రీసెర్చ్ హెడ్ శమంతక్ దాస్ మాట్లాడుతూ రెపో రేటు పెంపు హోం బయర్స్ సెంటిమెంట్లను దెబ్బతీస్తుందని అన్నారు. అయితే హౌజింగ్ అమ్మకాలు పూర్వస్థితిలోనే ఉంటాయన్న నమ్మకాన్ని వ్యక్తంచేశారు.

ఇన్వెస్టర్స్ క్లినిక్ ఫౌండర్ హనీ కటియాల్ మాట్లాడుతూ వడ్డీ రేట్ల పెంపు రియల్ ఎస్టేట్ సెక్టార్‌ను తీవ్రంగా బాధిస్తుందని అన్నారు. వడ్డీ రేట్లు స్థిరంగా ఉండాలని ఆకాంక్షించారు.

తదుపరి వ్యాసం