తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Hdfc Fd Interest Rates : ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ

HDFC FD Interest Rates : ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ

HT Telugu Desk HT Telugu

17 June 2022, 18:02 IST

    • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది.
హెచ్‌డీఎఫ్‌సీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ వడ్డీ రేట్ల పెరుగుదల
హెచ్‌డీఎఫ్‌సీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ వడ్డీ రేట్ల పెరుగుదల (REUTERS)

హెచ్‌డీఎఫ్‌సీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ వడ్డీ రేట్ల పెరుగుదల

దేశంలోని ప్రయివేటు రంగంలోని బ్యాంకుల్లో అతిపెద్దదైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. 

ట్రెండింగ్ వార్తలు

Cricket ball : జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

నేడు జూన్ 17, 2022 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. విభిన్న కాలవ్యవధులతో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై విభిన్న వడ్డీ రేట్లు వర్తిస్తాయి. 

ప్రస్తుతం 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య వివిధ కాలాలకు గాను డిపాజిట్ చేస్తే సాధారణ ప్రజలకు 2.75 శాతం నుండి 5.75 శాతం మధ్య, సీనియర్ సిటిజన్‌లకు 3.25 శాతం నుండి 6.50 శాతం వరకు వడ్డీ లభిస్తోంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు

బ్యాంకు 7 నుంచి 29 రోజుల డిపాజిట్లపై వడ్డీ రేటును 2.50 శాతం నుంచి 2.75 శాతానికి పెంచింది. ఈ టెర్మ్‌లో 25 బేసిస్ పాయింట్ల పెరుగుదల కనిపించింది.

30 నుంచి 90 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును బ్యాంక్ 25 బేసిస్ పాయింట్లు పెంచి.. 3 శాతం నుంచి 3.25 శాతానికి పెంచింది. 

91 రోజుల నుండి 6 నెలల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇప్పుడు 3.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇప్పటివరకు 3.50 శాతంగా ఉంది.

6 నెలల 1 రోజు నుండి 9 నెలల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇప్పుడు 4.65 శాతం వడ్డీ లభిస్తుంది. అంతకు ముందు 4.40 శాతం లభించేది. 

9 నెలల 1 రోజు నుండి 1 సంవత్సరం లోపు మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై 4.65 శాతం వడ్డీ లభిస్తుంది. ఇప్పటివరకు 4.50 శాతం వడ్డీ లభించేది. ఒక సంవత్సరం నుండి రెండేళ్లలోపు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ ఇప్పుడు 5.35 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 

రెండు సంవత్సరాల ఒక రోజు నుంచి మూడు సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లు ఇప్పుడు 5.40 శాతానికి బదులుగా 5.50 శాతం వడ్డీని ఇస్తాయి. 

3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లు ఇప్పుడు 5.70 శాతం వడ్డీ అందిస్తాయి. ఇది గతంలో 5.60 శాతం ఉండేది.

అయితే 5 సంవత్సరాల 1 రోజు నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ఇంతకుముందు కూడా ఇలాగే ఉండేది.