తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Hc Quashes Fir Against Actor Suriya: హీరో సూర్యపై కేసు కొట్టివేసిన హైకోర్టు

HC quashes FIR against actor Suriya: హీరో సూర్యపై కేసు కొట్టివేసిన హైకోర్టు

HT Telugu Desk HT Telugu

11 October 2022, 14:59 IST

  • HC quashes FIR against actor Suriya: ‘జై భీమ్’ సినిమాకు సంబంధించిన నటుడు సూర్య, ఆ సినిమా దర్శకుడు జ్ఞానవేల్ రాజా పై నమోదైన ఎఫ్ఐఆర్ ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది.

నటుడు సూర్య
నటుడు సూర్య

నటుడు సూర్య

HC quashes FIR against actor Suriya: సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. జస్టిస్ చంద్రు న్యాయవాదిగా పని చేస్తున్న సమయంలో తాను వాదించిన ఒక కేసు ఆధారంగా ఆ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో నటనకు గానూ సూర్యకు ఇటీవల జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా వచ్చింది.

HC quashes FIR against actor Suriya: ఆ వర్గానికి అవమానం

అయితే, సినిమాలో వన్నియార్ సామాజిక వర్గాన్ని అవమానించారని, అందువల్ల ఆ సినిమా దర్శకుడు జ్ఞానవేల్ రాజా, నటుడు సూర్య శివకుమార్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రుద్ర వన్నియార్ సేనకు చెందిన కే సంతోశ్ తమిళనాడులోని సైదాపేట్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశారు. దాంతో, వారిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆ కోర్టు ఈ సంవత్సరం మే 6వ తేదీన ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

HC quashes FIR against actor Suriya: ఆ సీన్లు తీసేశాం..

తమపై కేసు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ జ్ఞానవేల్ రాజా, నటుడు సూర్య మద్రాసు హైకోర్టును ఆశ్రయించి, తమ వాదన వినిపించారు. జై భీమ్ సినిమాను ఒక నిజ జీవిత ఘటన ఆధారంగా రూపొందించామని, అందులో ఐజీ పెరుమళ స్వామి, న్యాయవాది చంద్రు పేర్లను మినహాయిస్తే, మిగతా వారి పేర్లను మార్చామని, అలాగే, వన్నియార్లను చూపించే కేలండర్ ఉన్న సీన్ ను కూడా తొలగించామని వారు కోర్టుకు వివరించారు. ఆ సినిమాకు సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చిందని, అదీకాక, ఆ సినిమాను ఓటీటీలో మాత్రమే విడుదల చేశామని, అందువల్ల ఆ సినిమాను చూసిన ప్రేక్షకుల సంఖ్య కూడా తక్కువేనని వివరించారు.

HC quashes FIR against actor Suriya: సీఎం కూడా చూశారు..

ఈ సినిమాను నవంబర్ 1వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా చూసి, తమను అభినందించారని కోర్టుకు తెలిపారు. జై భీమ్ సినిమాను కులం, మతం, వర్గం, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఆదరించారని, సినిమాకు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చిన విషయాన్ని తెలిపారు. అనంతరం, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ మద్రాసు హైకోర్టు మంగళవారం ఆదేశాలిచ్చింది.