తెలుగు న్యూస్  /  National International  /  Government Issues Advisory For Zoom Users, Check Details

Government advisory for Zoom users : జూమ్​ యూజర్స్​కు కేంద్రం 'అలర్ట్​'..

Sharath Chitturi HT Telugu

19 September 2022, 15:22 IST

    • Alert for Zoom users : జూమ్​ యూజర్స్​కు కేంద్రం అలర్ట్​ జారీ చేసింది. జూమ్​లో చాలా లోపాలు ఉన్నాయని, భద్రతాపరమైన సమస్యలు రావొచ్చని హెచ్చరించింది.
‘జూమ్​లో చాలా లోపాలు ఉన్నాయి.. జాగ్రత్తగా ఉండండి’
‘జూమ్​లో చాలా లోపాలు ఉన్నాయి.. జాగ్రత్తగా ఉండండి’ (REUTERS)

‘జూమ్​లో చాలా లోపాలు ఉన్నాయి.. జాగ్రత్తగా ఉండండి’

Government advisory for Zoom users : ఆఫీస్​ కార్యకలాపాలు, కుటుంబ సభ్యులతో వీడియో కాల్​ కోసం మీరు జూమ్​ యాప్​ని వినియోగిస్తూ ఉంటారా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి! జూమ్​లో అనేక లోపాలు ఉన్నాయని, ఫలితంగా భద్రతపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని సీఈఆర్​టీ-ఇన్​ (ఇండియన్​ కంప్యూటర్​ ఎమర్జెన్సీ రెస్పాన్స్​ టీమ్​) హెచ్చరించింది. ఈ మేరకు జూమ్​ యూజర్స్​ జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

ICSE exam results 2024 : త్వరలో ఐసీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

Manipur news: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై కుకీ మిలిటెంట్ల దాడి; ఇద్దరు జవాన్లు మృతి

Nainital fire: నైనిటాల్ అడవుల్లో కార్చిచ్చు; జనావాసాల్లోకి విస్తరిస్తున్న మంటలు

CERT IN alert for Zoom users : 'లోపాలు ఉన్నాయి..'

సీఈఆర్​టీ ఇన్​ ప్రకారం.. జాయిన్​ లిస్ట్​లో లేని అనాథరైజిడ్​ రిమోట్​ యూజర్​ కూడా.. మీతో పాటు జూమ్​ మీటింగ్​లో చేరవచ్చు. ఈ మేరకు జూమ్​ సిస్టమ్​లో ఉన్న భద్రతాపరమైన పరిమితులను ఆ అనాథరైజిడ్​ యూజర్​ ఛేదించుకుని రావచ్చు. ఈ లోపాల కారణంగా.. సంబంధిత వ్యక్తులు ఎవరికీ తెలియకుండా జూమ్​ మీటింగ్​లోకి ప్రవేశించి.. సంబంధిత ఆడియో, వీడియోను రికార్డ్​ చేసుకునే అవకాశం ఉంది.

కేంద్ర ఎలక్ట్రానిక్స్​- ఐటీశాఖకు చెందిన సీఈఆర్​టీ- ఇన్​.. బగ్స్​, సైబర్​ దాడులు, ఫిషింగ్​ దాడులు, హ్యాకింగ్​ వంటి సమస్యలపై దృష్టిపెడుతూ ఉంటుంది. నిత్యం ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంటుంది.

Zoom app vulnerabilities : వాస్తవానికి ఈ లోపాల విషయం జూమ్​ సంస్థకు ముందే తెలుసు! జూమ్​లో ఈ తరహా లోపాలను సీవీఈ- 2022-28758, సీవీఈ 2022-28759, సీవీఈ- 2022-28760గా పిలుస్తున్నారు. వీటి వల్ల ఆన్​ ప్రిమైస్​ మీటింగ్​ కెనెక్టర్​ ఎంఎంఆర్​ ముందు వర్షెన్​ 4.8.20220815.130 ప్రభావితమైందని జూమ్​ గుర్తించింది. ఈ మేరకు ఈ నెల 13నే ఈ విషయంపై అలర్ట్​ చేసింది జూమ్​.

ఇక జూమ్​ మీటింగ్​పై తాజాగా కేంద్రం ఈ వ్యవహారంపై సోమవారం సూచనలు జారీ చేసింది. జూమ్​ యూజర్స్​ అందరు తమ పరికరాలపై జూమ్​ లేటెస్ట్​ వర్షెన్​ను అప్డేట్​ చేసుకోవాలని సూచించింది.

How to update Zoom app in desktop : డెస్క్​టాప్​లో జూమ్​ని ఇలా అప్డేట్​ చేసుకోండి..

  • ముందుగా జూమ్​ డెస్క్​టాప్​ క్లైయింట్​లో సైన్​ ఇన్​ అవ్వండి.
  • మీ ప్రొఫైల్​ పిక్చర్​ మీద క్లిక్​ చేయండి. అప్డేట్స్​ కోసం చూడండి.
  • కొత్త వర్షెన్​ కనిపిస్తే.. దానిని డౌన్​లోడ్​ చేసి, ఇన్​స్టాల్​ చేయండి.

ఇక స్మార్ట్​ఫోన్​లో.. గూగుల్​ ప్లే, యాపిల్​ ప్లే స్టోర్​లోకి వెళ్లి జూమ్​ యాప్​ని అప్డేట్​ చేసుకోవాల్సి ఉంటుంది.

టాపిక్