తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Apple Security Flaw : యాపిల్​ యూజర్లకు అలర్ట్​​.. ఐఫోన్​, ఐప్యాడ్​కు 'హ్యాకింగ్​' దెబ్బ!

Apple security flaw : యాపిల్​ యూజర్లకు అలర్ట్​​.. ఐఫోన్​, ఐప్యాడ్​కు 'హ్యాకింగ్​' దెబ్బ!

Sharath Chitturi HT Telugu

19 August 2022, 10:29 IST

google News
  • Apple security flaw :  మీరు ఐఫోన్​, ఐప్యాడ్​ వినియోగిస్తున్నారు? అయితే మీ ప్రాడక్టులు హ్యాకింగ్​కు గురయ్యే ముప్పు ఉంది. ఈ విషయాన్ని యాపిల్​ సంస్థ స్వయంగా ప్రకటించింది.

యాపిల్​ యూజర్లకు అలర్ట్​​.. ఐఫోన్​, ఐప్యాడ్​కు 'హ్యాకింగ్​' దెబ్బ!
యాపిల్​ యూజర్లకు అలర్ట్​​.. ఐఫోన్​, ఐప్యాడ్​కు 'హ్యాకింగ్​' దెబ్బ! (AFP)

యాపిల్​ యూజర్లకు అలర్ట్​​.. ఐఫోన్​, ఐప్యాడ్​కు 'హ్యాకింగ్​' దెబ్బ!

Apple security flaw : యాపిల్​ వినియోగదారులకు షాక్​! ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్​ కంప్యూటర్లు హ్యాకింగ్​కు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని యాపిల్​ సంస్థ స్వయంగా వెల్లడించింది.

ఆపరేటింగ్​ సిస్టమ్​లో భద్రతా పరమైన లోపాలను గుర్తించినట్టు, ఈ సమస్య వల్ల యాపిల్​ ప్రాడక్టులు హ్యాకింగ్​కు గురయ్యే అవకాశం ఉన్నట్టు సంస్థ పేర్కొంది. ఇప్పటికే.. పలు ప్రాడక్టులు హ్యాక్​ అయినట్టు అనుమానిస్తున్నట్టు వెల్లడించింది. హ్యాకింగ్​ ముప్పు నుంచి బయటపడేందుకు.. యూజర్లు తొందరగా సాఫ్ట్​వేర్​ను అప్డేట్​ చేసుకోవాలని సూచించింది.

కాగా.. ఆపరేటింగ్​ సిస్టమ్​లో లోపాల కారణంగా ఇప్పటివరకు యూజర్ల డేటాకు ఎంత నష్టం జరిగింది? అన్న విషయంపై యాపిల్​ సంస్థ పూర్తి వివరాలు ఇవ్వలేదు.

ఈ డివైజ్​లకు హ్యాకింగ్​ ముప్పు..!

ఐఫోన్​ 6ఎస్​ మోడల్​, ఐప్యాడ్​ 5 జనరేషన్​, ఐప్యాడ్​ ఎయిర్​ 2, ఐప్యాడ్​ మిని 4, ప్యాడ్​ ప్రో, 7 జనరేషన్​ ఐపాడ్​ టచ్​తో పాటు మరిన్ని డివైజ్​లకు హ్యాకింగ్​ ముప్పు ఉందని యాపిల్​ వెల్లడించింది. హ్యాకర్లు.. ఆపరేటింగ్​ సిస్టమ్​ సాయంతో.. డివైజ్​ను తమ ఆధీనంలోకి తీసుకునే ముప్పు ఉందని యాపిల్​ పేర్కొంది.

మ్యాక్​ కంప్యూటర్స్​, యాపిల్​ సఫారి బ్రౌజర్​కి కూడా హ్యాకింగ్​ ముప్పు పొంచి ఉంది.

అందువల్ల.. డివైజ్​ల సాఫ్ట్​వేర్​ను అప్డేట్​ చేసుకోవాలని సైబర్​సెక్యూరిటీ నిపుణులు సైతం యాపిల్​ యూజర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.

తదుపరి వ్యాసం