Apple layoffs 2022 : యాపిల్​లో ఉద్యోగాలు కట్​.. ఉద్యోగుల్లో ఆందోళన!-apple layoffs its 100 employees due to cost cutting situations ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Apple Layoffs 2022 : యాపిల్​లో ఉద్యోగాలు కట్​.. ఉద్యోగుల్లో ఆందోళన!

Apple layoffs 2022 : యాపిల్​లో ఉద్యోగాలు కట్​.. ఉద్యోగుల్లో ఆందోళన!

Sharath Chitturi HT Telugu
Aug 16, 2022 01:53 PM IST

Apple layoffs 2022 : యాపిల్​ సంస్థ.. 100మంది ఉద్యోగులను తొలగించింది. ఈ వ్యవహారంలో ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.

<p>యాపిల్​లో ఉద్యోగాలు కట్​</p>
యాపిల్​లో ఉద్యోగాలు కట్​ (Bloomberg)

Apple layoffs 2022 : ప్రపంచవ్యాప్తంగా టెక్​ ఉద్యోగాలు ఊడిపోతున్నాయి! కాస్ట్​ కటింగ్​ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్న సంస్థల జాబితా రోజురోజుకు పెరిగిపోతోంది. దిగ్గజ సంస్థల పేర్లు కూడా ఈ జాబితాలో కనిపిస్తుండటం ఆందోళనకర విషయం. తాజాగా ఈ జాబితాలోకి 'యాపిల్​' చేరింది!

యాపిల్​ సంస్థ.. 100 మంది కాంట్రాక్ట్​ ఆధారిత వర్కర్లను తొలగించినట్టు ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్​బర్గ వెల్లడించింది. ఈ 100 మంది.. హెచ్​ఆర్​ డిపార్ట్​మెంట్​లో పని చేసేవారు. కొత్త ఉద్యోగులను నియమించుకోవడం వీరి పని. కాగా.. కొత్త ఉద్యోగాలను తగ్గించే క్రమంలో ఈ కాంట్రాక్ట్​ ఉద్యోగులను యాపిల్​ తొలగించినట్టు తెలుస్తోంది.

సంబంధిత 100మంది కాంట్రాక్టులను అర్ధాంతరంగా తొలగించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. వారికి రెండు వారాల జీతాన్ని ఇచ్చేందుకు యాపిల్​ సిద్ధపడినట్టు సమాచారం. ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాంట్రాక్టు ఉద్యోగులను రీటైన్​ చేసుకోవడం లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఫుల్​టైమ్​ హెచ్​ఆర్​లుగా పనిచేస్తున్న వారిని సంస్థ రీటైన్​ చేసుకుంది.

ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి వ్యవహరిస్తామని.. గత నెలలోనే యాపిల్​ సీఈఓ టిమ్​ కుక్​ ఓ ప్రకటన చేశారు.

గూగుల్​ కూడా..

Google layoffs : ఇటీవలే.. లేఆఫ్​ల విషయంలో గూగుల్​ సంస్థ.. తన ఉద్యోగులను భయపెట్టేసింది. సంస్థ ఫలితాలు మెరుగుపడకపోతే.. ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంటుందని.. ఉద్యోగులకు ముందుగానే నోటీసులు జారీ చేసింది.

ఈ పరిణామాలతో ఆయా సంస్థల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తమని ఎక్కడ ఉద్యోగాల నుంచి తప్పిస్తారోనని ఆవేదనకు గురవుతున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్