Layoffs 2022 : 'టెక్​' ఉద్యోగాలు ఊడిపోతున్నాయి.. 22వేల మంది ఇంటికి!-layoffs 2022 over 22 000 techies lose job in us indian startups fire 12 000 employees ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Layoffs 2022 : 'టెక్​' ఉద్యోగాలు ఊడిపోతున్నాయి.. 22వేల మంది ఇంటికి!

Layoffs 2022 : 'టెక్​' ఉద్యోగాలు ఊడిపోతున్నాయి.. 22వేల మంది ఇంటికి!

Sharath Chitturi HT Telugu
Jul 03, 2022 10:00 PM IST

Layoffs 2022 : మాంద్యం భయాల మధ్య అనేకమంది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. అమెరికాలో ఈ ఏడాది ఇప్పటివరకు 22వేల మంది టెక్​ ఉద్యోగులు.. తమ ఉద్యోగాలు కోల్పోయారు! భారత్​లోనూ పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి.

<p>'టెక్​' ఉద్యోగాలు ఊడిపోతున్నాయి.. 22వేల మంది ఇంటికి!</p>
'టెక్​' ఉద్యోగాలు ఊడిపోతున్నాయి.. 22వేల మంది ఇంటికి! (iStock)

Layoffs 2022 : రెసెషన్​ భయం వేళ ఉద్యోగాల కోత వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 'కాస్ట్​ కట్టింగ్​' పేరుతో బడా సంస్థలు ఇప్పటికే ఉద్యోగులను కట్​ చేస్తున్నాయి. ఈ ఏడాది.. అమెరికాలో ఇప్పటికే 22వేల మంది టెక్​ సంస్థలకు చెందిన వారు ఉద్యోగాలు కోల్పోయినట్టు చర్న్​బేస్​ నివేదిక పేర్కొంది. ఇండియాలోని అంకుర సంస్థలు ఈ ఏడాది 12వేల మందిని ఉద్యోగం నుంచి తొలగించినట్టు వెల్లడించింది.

నివేదిక ప్రకారం.. కొవిడ్​ పరిస్థితులతో లబ్ధి పొందిన సంస్థలు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. వాల్యుయేషన్లు కరెక్ట్​ అవుతుండటం ఇందుకు కారణం. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులు సేకరించడం మరింత కష్టంగా మారిందని స్టార్ట్​అప్స్​ ఆందోళన చెందుతున్నాయి.

Job cuts 2022 : నెట్​ఫ్లిక్స్​, రాబిన్​హుడ్​ వంటి సంస్థలు.. ఇప్పటికే సిబ్బందిని తగ్గించుకోవడం మొదలుపెట్టాయి. కాయిన్​బేస్​, జెమిని, క్రిప్టో.కామ్​, వాల్డ్​, బైబిట్​, బిట్​పాండా వంటి క్రిప్టోకు సంబంధించిన సంస్థలు కూడా చేతులెత్తేస్తున్నాయి.

ఈ జాబితాలోకి ఆటో దిగ్గజం టెస్లా కూడా చేరడం గమనార్హం. ఇప్పటికే 10శాతం సిబ్బందిని టెస్లా కట్​ చేసేసింది. ఈ దెబ్బకు అమెరికాలోని ఓ కార్యాలయమే మూతపడిపోయింది.

ఇక ఇండియా విషయానికొస్తే.. ఒక్క 2022లోనే అంకుర సంస్థలు.. 60వేలకుపైగా ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.

Job cuts in startups : ఓలా, బ్లింక్​ఇట్​, బైజూస్​, అన్​అకాడమీ, వేదాంతు, కార్స్​24, లిడో లర్నింగ్​తో పాట ఇతర సంస్థలు ఇప్పటికే 12వేల మందిని ఇంటికి పంపించేశాయి.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్