తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Zoom App: జూమ్ యాప్ యూజర్స్‌కు అలర్ట్.. ఈ ల్యాప్‌టాప్‌లలో జూమ్ యాప్ పని చేయదు

Zoom App: జూమ్ యాప్ యూజర్స్‌కు అలర్ట్.. ఈ ల్యాప్‌టాప్‌లలో జూమ్ యాప్ పని చేయదు

HT Telugu Desk HT Telugu

19 June 2022, 16:00 IST

    • కరోనా కారణంగా వీడియో కాన్ఫరెన్స్ యాప్ జూమ్ (Zoom)కు బాగా డిమాండ్ పెరిగింది. ఈ సర్వీస్‌ను ఆండ్రాయిడ్, IOS, డెస్క్‌టాప్, విండోస్ ఇలా రకరకాల డివైజ్‌ల ద్వారా యూజర్లు వినియోగిస్తున్నారు. తాజాగా జూమ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆగస్ట్ నుండి క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్‌‌లలో జూమ్‌ యాప్ పని చేయదని వెల్లడించింది. 
ZOOM
ZOOM (REUTERS)

ZOOM

కరోనా కారణంగా వరల్డ్‌ వైడ్‌గా వర్చువల్ వీడియో యాస్స్‌కు ఎంత డిమాండ్ పెరిగిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా జూమ్‌ యాప్‌ వినియోగం విపరితంగా పెరిగిపోయింది. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగాలకు, సంస్థలకు జూమ్ యాప్ వారధిగా పనిచేస్తోంది. అయితే తాజాగా జూమ్‌ యాప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్‌ నుంచి Chromebooks ల్యాప్‌ట్యాప్‌లలో Zoom యాప్‌ సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

హై కోర్ ల్యాప్‌ ట్యాప్స్‌ కన్నా గూగుల్‌ క్రోమ్‌బుక్స్‌(ల్యాప్‌ ట్యాప్‌ తరహాలో) లిమిటెడ్‌ సపోర్ట్‌తో పని చేస్తాయి. వీటిలో విండోస్‌ సపోర్ట్‌ చేయదు. గూగుల్‌ ప్రత్యేకంగా తయారు చేసిన Chrome OSతో మాత్రమే ఇవి పని చేస్తాయి. వీటిలో సాధరణ ల్యాప్ టాప్స్ మాదిరి అన్ని యాప్‌ల సేవలను ఉపయోగించుకోవడం కుదరదు.  నిలుపుదలకు సంబంధించి ఇప్పటికే Chromebook వినియోగదారులకు నోటిఫికేషన్‌లు పంపబడుతున్నాయి. ఆగస్ట్ 2022 నుండి, Zoom యాప్ వారి ల్యాప్‌టాప్‌లలో ఉపయోగించడం కుదరదు. అయితే ఈ విషయంలో Chromebook యూజర్స్ కొంత వెసులుబాటును కూడా కల్పించింది. యూజర్లు క్రోమ్ ఓఎస్‌లో జూమ్ ఫర్ క్రోమ్-ప్రోగ్రెసివ్ వెబ్ యాప్ (PWA) ఉపయోగించడం ద్వారా పరిమిత సేవలను పొందవచ్చు. జూమ్ యాప్ సేవలు ఆగస్టులో నిలిచిపోయినా.. వీడియో కాల్స్ కోసం జూమ్ ఫర్ క్రోమ్‌ పీడబ్ల్యూఏ  జూమ్ వెబ్ యాప్‌ను వినియోగించుకోవచ్చు.

దీని కోసం మీరు Googleకి వెళ్లి 'జూమ్ PWA' అని టైప్ చేస్తే, ఆ తర్వాత మీకో లింక్ వస్తుంది. ఈ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా, మీరు సైన్ ఇన్ చేయకుండానే 'మీటింగ్‌లో చేరండి'పై క్లిక్ చేసి సమావేశంలో జాయిన్ అవవచ్చు. సమావేశాన్ని షెడ్యూల్ చేయాలనుకుంటే, సైన్ ఇన్ చేయాలి.

టాపిక్