తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Capsicum Pachadi: స్పైసీగా క్యాప్సికం పచ్చడి ఇలా చేసుకోండి, చూడగానే నోరూరిపోతుంది

Capsicum Pachadi: స్పైసీగా క్యాప్సికం పచ్చడి ఇలా చేసుకోండి, చూడగానే నోరూరిపోతుంది

Haritha Chappa HT Telugu

10 May 2024, 17:30 IST

    • Capsicum Pachadi: క్యాప్సికం కూర నచ్చని వారు క్యాప్సికంతో పచ్చడి చేసుకుంటే రుచిగా ఉంటుంది. దీన్ని చేయడం చాలా సులువు. చూడగానే నోరూరేలా ఉంటుంది.
క్యాప్సికం పచ్చడి రెసిపీ
క్యాప్సికం పచ్చడి రెసిపీ (Youtube)

క్యాప్సికం పచ్చడి రెసిపీ

Capsicum Pachadi: క్యాప్సికం పేరు చెబితేనే చాలామందికి నచ్చదు. పచ్చి వాసన వస్తుందని పక్కన పెడతారు. నిజానికి క్యాప్సికం ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. క్యాప్సికం కూరను నచ్చని వారు క్యాప్సికం పచ్చడిని చేసుకొని తినండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో క్యాప్సికం లో ముక్కలుగానే ఉంచుతాం కాబట్టి, క్యాప్సికం ఆవకాయలా ఉంటుంది ఈ పచ్చడి. ఒక్కసారి చేసుకున్నారంటే రెండు రోజులు తాజాగా నిల్వ ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Liver Cancer Symptoms : ఈ లక్షణాలను అస్సలు విస్మరించకూడదు.. కాలేయ క్యాన్సర్ కావొచ్చు

ICMR On Weight Loss : వారంలో ఎంత బరువు తగ్గితే ఆరోగ్యానికి మంచిది.. తగ్గేందుకు టిప్స్

Mandaram Health Benefits : జుట్టుకే కాదు ఆరోగ్యానికి కూడా మందారం పువ్వుతో అనేక లాభాలు

Honey and Aloe Vera Gel : ముఖం, మెడపై ఒక వారంపాటు తేనె, కలబంద జెల్ రాస్తే మెరిసిపోతారు

క్యాప్సికం పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు

క్యాప్సికం- రెండు

మెంతులు - పావు స్పూను

కారం - రెండు స్పూన్లు

పసుపు - పావు స్పూను

జీలకర్ర పొడి - అర స్పూను

మెంతి పొడి - పావు స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

చింతపండు పులుసు - పావు గ్లాసు

ఉప్పు - రుచికి సరిపడా

క్యాప్సికం పచ్చడి రెసిపీ

1. క్యాప్సికమ్ ను చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.

2. స్టవ్ మీద కళాయి పెట్టి మూడు స్పూన్ల నూనె వేయాలి.

3. ఆ నూనెలో అర స్పూను జీలకర్ర, పావు స్పూన్ మెంతులు వేసి వేయించాలి.

4. ఆ తర్వాత క్యాప్సికం ముక్కలను వేసి కలిపి మూత పెట్టాలి.

5. ఆ నూనెలోనే క్యాప్సికం ముక్కలు మగ్గిపోతాయి.

6. ఆ తర్వాత మూత తీసి పసుపు, కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి వేసి బాగా కలుపుకోవాలి.

7. అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసి బాగా కలపాలి.

8. ముందుగానే చింతపండు నానబెట్టుకొని పావు గ్లాసు చింతపండు రసాన్ని కూడా వేయాలి.

9. రుచికి సరిపడా ఉప్పును చల్లుకోవాలి.

10. ఈ మొత్తం మిశ్రమాన్ని చిన్న మంట మీద మగ్గనివ్వాలి.

11. నూనె పైకి తేలి ఇగురులాగా అవుతుంది. అప్పుడు స్టవ్ కట్టేయాలి. అంతే క్యాప్సికం పచ్చడి రెడీ అయినట్టే.

12. ఇది వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చపాతీ, రోటీల్లోకి కూడా తినవచ్చు.

క్యాప్సికం కూరను ఇష్టపడని వారు, ఇలా క్యాప్సికం పచ్చడిగా తింటే తినాలనిపిస్తుంది. ఈ క్యాప్సికం ముక్కలు కూడా నూనెలో బాగా మగ్గుతాయి. కాబట్టి పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఒక్కసారి ఇలా క్యాప్సికం పచ్చడి చేసుకొని చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం. క్యాప్సికం రెసిపీలలో ఈ పచ్చడిని ఎక్కువ మంది ఇష్టపడతారు. దీన్ని చేసేందుకు పెద్దగా కష్టపడక్కర్లేదు. కేవలం అరగంటలో ఇది రెడీ అయిపోతుంది. ఒక్కసారి చేసుకుంటే రెండు మూడు రోజులు పాటు తాజాగా ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం