Fenugreek Seeds: షుగర్ లెవెల్స్ కంట్రోల్‍కు మెంతులు ఉపయోగపడతాయా? రోజుకు ఎన్ని తీసుకుంటే మేలు!-how much fenugreek seeds better for control blood sugar levels control for diabetes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fenugreek Seeds: షుగర్ లెవెల్స్ కంట్రోల్‍కు మెంతులు ఉపయోగపడతాయా? రోజుకు ఎన్ని తీసుకుంటే మేలు!

Fenugreek Seeds: షుగర్ లెవెల్స్ కంట్రోల్‍కు మెంతులు ఉపయోగపడతాయా? రోజుకు ఎన్ని తీసుకుంటే మేలు!

Chatakonda Krishna Prakash HT Telugu
May 16, 2023 06:19 PM IST

Fenugreek Seeds for diabetes: డయాబెటిస్ ఉన్న వారు రోజుకు ఎంత మెంతులను తీసుకుంటో మంచిదో నిపుణులు సూచించారు. బ్లగ్ షుగర్ లెవెల్స్‌ను మెంతులు కంట్రోల్ చేయగలవు.

Fenugreek Seeds: షుగర్ లెవెల్స్ కంట్రోల్‍కు మెంతులు ఉపయోగపడతాయా? రోజుకు ఎన్ని తీసుకుంటే మేలు! (Photo Credit: Freepik)
Fenugreek Seeds: షుగర్ లెవెల్స్ కంట్రోల్‍కు మెంతులు ఉపయోగపడతాయా? రోజుకు ఎన్ని తీసుకుంటే మేలు! (Photo Credit: Freepik)

Fenugreek Seeds for diabetes: ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇతర గింజలతో పోలిస్తే మెంతులు (Fenugreek Seeds) ప్రత్యేకంగా నిలుస్తాయి. వంటకాల్లో వీటిని బాగా వాడతారు. అయితే, ఆరోగ్య పరంగానూ మెంతులకు మంచి విలువ ఉంది. జుట్టు పెరుగుదల నుంచి జీర్ణక్రియ, బరువు తగ్గడం వరకు చాలా వాటికి మెంతి గింజలు ఉపయోగపడతాయి. డయాబెటిస్ (Diabetes) నియంత్రణ కోసం మీరు మెంతులు వాడాలని అనుకుంటుంటే.. రోజుకు ఏంత మేర తీసుకుంటే మంచిదో ఇక్కడ తెలుసుకోండి. ముఖ్యమైన విషయాలను చూడండి.

Fenugreek Seeds for diabetes: మెంతి గింజలు.. బ్లడ్ షుగర్ స్థాయిలను (Blood Sugar Levels) కంట్రోల్ చేస్తాయి. అయితే, రోజులో మరీ ఎక్కువగా మెంతులు తీసుకుంటే.. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే సరిపడా మాత్రమే తీసుకోవాలి. డాక్టర్ మీకు సూచించిన మందులను వేసుకుంటూనే.. వాటితో పాటు మోతాదు మేర మెంతులు తీసుకోవాలి. ఆ వివరాలను న్యూట్రిషనిస్ట్ రాశి చాహల్ పేర్కొన్నారు.

బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను ఎలా కంట్రోల్ చేస్తాయి?

Fenugreek Seeds for diabetes: మెంతి గింజలు యాంటీ-డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. అవి ఇన్సులిన్ నిరోధకతకు మెరుగుపరుస్తాయి. “మెంతుల్లో కరిగే లక్షణం ఉండే ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియ, కార్బొహైడ్రేట్లను శోషించడాన్ని కాస్త నెమ్మదింపజేసి బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండేలా సాయపడుతుంది. ఆహారంలో మెంతులను జోడించడం వల్ల డైట్ కంట్రోల్, బ్లడ్ గ్లూకోజ్‍, హెచ్‍బీఏ1సీ స్థాయిలపై ప్రభావం ఉంటుంది. అయితే ఇది ఆలస్యం కూడా కావొచ్చు” అని చాహల్ చెప్పారు.

ఎలా.. ఎంత తీసుకోవాలి?

Fenugreek Seeds for diabetes: ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్ ఉండే వాళ్లు, క్యాలరీలు తక్కువగా ఉండే డైట్ పాటిస్తున్న వారు మెంతుల పొడిని, మెంతి గింజలను నీటిలో ననబెట్టి తాగవచ్చు. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్, ఇన్సులిన్ నిరోధకత కంట్రోల్ అవుతుంది.

రోజుకు 10 గ్రాముల మెంతి గింజలను తీసుకోవచ్చని చాహల్ వివరించారు. ఇలా 4-6 నెలలు చేశాక HbA1c తక్కువగా ఉంటుందని తెలిపారు. జర్నల్ ఆఫ్ డయాబెట్స్, మెటాబోలిక్ డిసార్డర్ అధ్యయనం కూడా.. టైప్-2 డయాబెటిస్ కోసం రోజుకు 10 గ్రాముల మెంతులను తీసుకోవచ్చని పేర్కొంది. అయితే, డయాబెటిస్ ఉన్న వారు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తరచూ చెక్ చేసుకుంటూనే ఉండాలి. డాక్టర్లు, డైటీషియన్ల సలహాలను ఎప్పటికప్పుడు తీసుకుంటుండాలి. ఎందుకంటే మీ షుగల్ లెవెల్స్‌ను బట్టి వైద్యులు.. మీ మెడికేషన్‍లో మార్పులు చేస్తుంటారు.

Fenugreek Seeds for diabetes: మరోవైపు, మెంతులను ఎక్కువగా తీసుకోవడం కూడా సరికాదని ఆ నిపుణులు చెప్పారు. ఎందుకంటే మోతాదుకు మించి ఎక్కువగా మెంతులను తీసుకుంటే బ్లడ్ షుగర్స్ మరీ తక్కువకు పడిపోయే ప్రమాదం ఉంటుంది. హై బ్లడ్ షుగర్ లాగానే లో బ్లడ్ షుగర్ కూడా ప్రమాదకరమే.

షుగల్ లెవెల్స్‌లో ఏ మాత్రం తేడాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆ మేర వారు మీకు ఇచ్చే మందుల డోసుల్లో మార్పులు చేస్తారు. డైట్‍ను కూడా సూచిస్తారు. ఒకవేళ మీరు మెంతులను వాడుతుంటే ఆ విషయం కూడా డాక్టర్లకు చెప్పాల్సి ఉంటుంది.

Whats_app_banner