తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  హెచ్చరిక! Usb డివైజ్‌లతో మీ Windows కంప్యూటర్‌లోకి మాల్వేర్ చేరే ప్రమాదం!

హెచ్చరిక! USB డివైజ్‌లతో మీ Windows కంప్యూటర్‌లోకి మాల్వేర్ చేరే ప్రమాదం!

09 May 2022, 15:12 IST

మీరు విండోస్ ఆధారిత కంప్యూటర్ వినియోగిస్తుంటే మీకో హెచ్చరిక. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న 'రాస్ప్బెర్రీ రాబిన్' అనే కొత్త మాల్వేర్‌తో ఇప్పుడు మీ డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా USB డ్రైవ్‌ల ద్వారా ఈ మాల్వేర్ మీ Windows డివైజ్‌లకు చేరుతుంది. 

మీరు విండోస్ ఆధారిత కంప్యూటర్ వినియోగిస్తుంటే మీకో హెచ్చరిక. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న 'రాస్ప్బెర్రీ రాబిన్' అనే కొత్త మాల్వేర్‌తో ఇప్పుడు మీ డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా USB డ్రైవ్‌ల ద్వారా ఈ మాల్వేర్ మీ Windows డివైజ్‌లకు చేరుతుంది. 

USB డ్రైవ్‌ల ద్వారా విండోస్ కంప్యూటర్‌లకు వ్యాపించే కొత్త మాల్వేర్‌ను సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకులు కనుగొన్నారు. అయితే ఇది ఎలా జరుగుతుందో ఇప్పటికీ పరిశోధకులకు తెలియరాలేదు.
(1 / 6)
USB డ్రైవ్‌ల ద్వారా విండోస్ కంప్యూటర్‌లకు వ్యాపించే కొత్త మాల్వేర్‌ను సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకులు కనుగొన్నారు. అయితే ఇది ఎలా జరుగుతుందో ఇప్పటికీ పరిశోధకులకు తెలియరాలేదు.(REUTERS)
టెక్ రాడార్ ప్రకారం, సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకులు ఈ మాల్‌వేర్‌కు పేరు పెట్టలేదు కానీ వారు రాస్ప్‌బెర్రీ రాబిన్ అని పిలిచే హానికరమైన గ్రూప్‌‌కి లింక్ చేశారు.
(2 / 6)
టెక్ రాడార్ ప్రకారం, సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకులు ఈ మాల్‌వేర్‌కు పేరు పెట్టలేదు కానీ వారు రాస్ప్‌బెర్రీ రాబిన్ అని పిలిచే హానికరమైన గ్రూప్‌‌కి లింక్ చేశారు.(Pixabay)
పరిశోధకుల నివేదిక ప్రకారం, "msiexec.exe ఇన్‌స్టాలర్ ప్యాకేజీలను డౌన్‌లోడ్ చేసి ఉపయోగించే సమయంలో సైబర్ విరోధులు కూడా మాల్వేర్‌ను జొప్పించే ప్రయత్నం చేస్తారు. C2 ప్రయోజనాల కోసం హానికరమైన డొమైన్‌కు ఎక్స్‌టర్నల్ నెట్‌వర్క్ కమ్యూనికేషన్‌ను ప్రయత్నించడానికి Raspberry Robin msiexec.exeని ఉపయోగిస్తుంది."
(3 / 6)
పరిశోధకుల నివేదిక ప్రకారం, "msiexec.exe ఇన్‌స్టాలర్ ప్యాకేజీలను డౌన్‌లోడ్ చేసి ఉపయోగించే సమయంలో సైబర్ విరోధులు కూడా మాల్వేర్‌ను జొప్పించే ప్రయత్నం చేస్తారు. C2 ప్రయోజనాల కోసం హానికరమైన డొమైన్‌కు ఎక్స్‌టర్నల్ నెట్‌వర్క్ కమ్యూనికేషన్‌ను ప్రయత్నించడానికి Raspberry Robin msiexec.exeని ఉపయోగిస్తుంది."(REUTERS)
ఒకసారి ఈ మాల్వేర్ ఎంటర్ అయితే .LNK ఫైల్ ద్వారా ఇతర డివైజ్ లకు వ్యాపిస్తుంది. USB డ్రైవ్‌లో ఎవరైనా ప్లగ్ చేసిన తర్వాత, మాల్వేర్ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఇన్‌ఫెక్షన్ ప్రాసెస్‌ను అమలు చేస్తుంది.
(4 / 6)
ఒకసారి ఈ మాల్వేర్ ఎంటర్ అయితే .LNK ఫైల్ ద్వారా ఇతర డివైజ్ లకు వ్యాపిస్తుంది. USB డ్రైవ్‌లో ఎవరైనా ప్లగ్ చేసిన తర్వాత, మాల్వేర్ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఇన్‌ఫెక్షన్ ప్రాసెస్‌ను అమలు చేస్తుంది.(REUTERS)
రాస్ప్బెర్రీ రాబిన్ హానికరమైన DLLని ఎందుకు ఇన్‌స్టాల్ చేస్తుందో అర్థం కావడం లేదు, ఇతర సిస్టమ్‌ను తమ నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం కావచ్చు అని పరిశోధకులు అంటున్నారు. కాబట్టి USB డ్రైవ్‌లు ఉపయోగించేటపుడు జాగ్రత్తపడండి.
(5 / 6)
రాస్ప్బెర్రీ రాబిన్ హానికరమైన DLLని ఎందుకు ఇన్‌స్టాల్ చేస్తుందో అర్థం కావడం లేదు, ఇతర సిస్టమ్‌ను తమ నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం కావచ్చు అని పరిశోధకులు అంటున్నారు. కాబట్టి USB డ్రైవ్‌లు ఉపయోగించేటపుడు జాగ్రత్తపడండి.(MINT_PRINT)

    ఆర్టికల్ షేర్ చేయండి