సరికొత్త Windows 11 అప్‌డేట్‌లో కొన్ని ముఖ్య ఫీచర్లు తొలగించిన మైక్రోసాఫ్ట్!-with launch of windows 11 microsoft removes essential features of its old version ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  సరికొత్త Windows 11 అప్‌డేట్‌లో కొన్ని ముఖ్య ఫీచర్లు తొలగించిన మైక్రోసాఫ్ట్!

సరికొత్త Windows 11 అప్‌డేట్‌లో కొన్ని ముఖ్య ఫీచర్లు తొలగించిన మైక్రోసాఫ్ట్!

Apr 11, 2022, 02:20 PM IST HT Telugu Desk
Apr 11, 2022, 02:20 PM , IST

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్ లాంచ్ చేస్తూనే Windows 10లోని డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్, టాస్క్‌బార్‌ను ఫీచర్లు అలాగే యూజర్లు ఎక్కువగా ఉపయోగించే మరికొన్ని ముఖ్యమైన ఫీచర్లను తొలగించింది. అయితే వీటిలోని కొన్ని ఫీచర్లను మాత్రమే కొత్త అప్‌డేట్‌లో ఇస్తున్నట్లు తెలిపింది. 

విండోస్ 11లో, మైక్రోసాఫ్ట్ టాస్క్‌బార్‌ను గ్రౌండ్ అప్ నుండి కొత్తగా ఆవిష్కరించింది. అదే సమయంలో విండోస్ 10లో ఉండేటు వంటి డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ సహా ఎక్కువగా ఉపయోగించే మరికొన్ని ఫీచర్లను కొత్త అప్‌డేట్‌లో మైక్రోసాఫ్ట్ తీసివేసింది.

(1 / 6)

విండోస్ 11లో, మైక్రోసాఫ్ట్ టాస్క్‌బార్‌ను గ్రౌండ్ అప్ నుండి కొత్తగా ఆవిష్కరించింది. అదే సమయంలో విండోస్ 10లో ఉండేటు వంటి డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ సహా ఎక్కువగా ఉపయోగించే మరికొన్ని ఫీచర్లను కొత్త అప్‌డేట్‌లో మైక్రోసాఫ్ట్ తీసివేసింది.(HT_PRINT)

అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ టాస్క్‌బార్ స్థానాన్ని స్క్రీన్ పైభాగానికి లేదా ఇరువైపులా మార్చగల ఫీచర్ కూడా విండోస్10లో తీసివేసింది. మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ చర్యకు వినియోగదారుల నుండి ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పాత అప్‌డేట్‌నే ఇష్టపడుతున్నట్లు వారు చెబుతున్నారు.

(2 / 6)

అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ టాస్క్‌బార్ స్థానాన్ని స్క్రీన్ పైభాగానికి లేదా ఇరువైపులా మార్చగల ఫీచర్ కూడా విండోస్10లో తీసివేసింది. మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ చర్యకు వినియోగదారుల నుండి ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పాత అప్‌డేట్‌నే ఇష్టపడుతున్నట్లు వారు చెబుతున్నారు.(HT_PRINT)

అయితే తాజా విండోస్ ఇన్‌సైడర్ వెబ్‌కాస్ట్‌లో, రాబోయే విండోస్ అప్‌డేట్‌లలో ఈ ఫీచర్లలో కొన్నింటిని తిరిగి తీసుకు రానున్నట్లు విండోస్ 11 డెవలప్‌మెంట్ టీమ్ ధృవీకరించింది. డ్రాగ్ అండ్ డ్రాప్ ఫంక్షనాలిటీ Windows 11 వెర్షన్ 22H2తో తిరిగి వస్తుందని తెలిపింది.

(3 / 6)

అయితే తాజా విండోస్ ఇన్‌సైడర్ వెబ్‌కాస్ట్‌లో, రాబోయే విండోస్ అప్‌డేట్‌లలో ఈ ఫీచర్లలో కొన్నింటిని తిరిగి తీసుకు రానున్నట్లు విండోస్ 11 డెవలప్‌మెంట్ టీమ్ ధృవీకరించింది. డ్రాగ్ అండ్ డ్రాప్ ఫంక్షనాలిటీ Windows 11 వెర్షన్ 22H2తో తిరిగి వస్తుందని తెలిపింది.(Amritanshu Mukherjee / HT Tech)

చాలా మంది యూజర్లు టాస్క్‌బార్‌ను డ్రాగ్ చేసే ఫీచర్ ఉపయోగించరు కాబట్టి, ఈ ఫీచర్ సరికొత్త Windows 11 బిల్డ్‌లో ఇవ్వలేదు. Microsoft ప్రస్తుతం ఇతర ఫీచర్‌లకు ప్రాధాన్యత ఇస్తోంది. Windows 11 బిల్డ్‌లో స్టార్ట్ మెనూ డిజైన్ లేదా యానిమేషన్ ఫ్లో కూడా ఇంకా సిద్ధం కాలేదు.

(4 / 6)

చాలా మంది యూజర్లు టాస్క్‌బార్‌ను డ్రాగ్ చేసే ఫీచర్ ఉపయోగించరు కాబట్టి, ఈ ఫీచర్ సరికొత్త Windows 11 బిల్డ్‌లో ఇవ్వలేదు. Microsoft ప్రస్తుతం ఇతర ఫీచర్‌లకు ప్రాధాన్యత ఇస్తోంది. Windows 11 బిల్డ్‌లో స్టార్ట్ మెనూ డిజైన్ లేదా యానిమేషన్ ఫ్లో కూడా ఇంకా సిద్ధం కాలేదు.(HT_PRINT)

మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం Windows 11లో డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్, టాబ్లెట్ ఆప్టిమైజేషన్, ఓవర్‌ఫ్లో ఐకాన్‌ల వంటి అత్యంత ప్రజాదరణ పొందిన ఫీచర్‌లను మరింత మెరుగుపరచడంపై దృష్టిపెడుతోంది. కాబట్టి టాస్క్‌బార్ స్థానాన్ని మార్చే ఫీచర్ ఇక ముందు అప్డేట్లలో కూడా ఆశించలేం.

(5 / 6)

మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం Windows 11లో డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్, టాబ్లెట్ ఆప్టిమైజేషన్, ఓవర్‌ఫ్లో ఐకాన్‌ల వంటి అత్యంత ప్రజాదరణ పొందిన ఫీచర్‌లను మరింత మెరుగుపరచడంపై దృష్టిపెడుతోంది. కాబట్టి టాస్క్‌బార్ స్థానాన్ని మార్చే ఫీచర్ ఇక ముందు అప్డేట్లలో కూడా ఆశించలేం.(Microsoft)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు