తెలుగు న్యూస్  /  National International  /  Gold And Silver Price In Bullion Markets Of India

Gold and Silver Price బంగారం, వెండి ధరలు తగ్గుముఖం...

HT Telugu Desk HT Telugu

03 October 2022, 6:19 IST

    • Gold and Silver Price today రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దసరా పండుగ సీజన్‌ కావడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చినా గత వారం ధరలతో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,730గా ఉంది. ఈ రోజు వెండి రేటు కూడా తగ్గింది.
మీ నగరాల్లో నేటి బంగారం ధర వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం ధర వివరాలు..

మీ నగరాల్లో నేటి బంగారం ధర వివరాలు..

Gold silver price today బంగారం ధరల్లో తరచూ హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వంటి అంశాలతో పాటు దేశీయ కొనుగోళ్ళ కారణంగా గత వారంలో ధరలు పెరిగాయి. గత వారం ముగింపుతో పోలిస్తే సోమవారం కాస్త ధరలు దిగివచ్చాయి. 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారంపై రూ.150 తగ్గితే 24 క్యారెట్లపై రూ.170 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,730గా నమోదైంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Crime news : 8ఏళ్ల బాలిక రేప్​- హత్య.. నిందితుడి వయస్సు 13ఏళ్లు!

Prajwal Revanna : కర్ణాటకను కుదిపేస్తున్న సెక్స్​ కుంభకోణం.. దేశాన్ని విడిచి వెళ్లిపోయిన రేవన్న!

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,500 వద్ద కొనసాగుతోంది. ఇవాళ కిలో వెండిపై రూ.100 తగ్గి, హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.62వేలుగా ఉంది.

Gold and silver price: ఆంధ్రప్రదేశ్‌లో ఇలా.....

Gold and silver price : విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.46,500గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర 50,730గా నమోదైంది. వెండి ధర కిలో రూ.62వేల వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500గా ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730గా ఉంది.

Gold and silver price: పలు నగరాల్లో ఇలా.....

gold and silver rate దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం నమోదవుతోంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,650గా ఉంటే… 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,890 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,550గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 వద్ద ఉంది. ఇక కోల్ కత్తాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 50,730గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,500 వద్ద కొనసాగుతోంది.

Platinum Price today: ప్లాటినం ధరలు ఇలా...

ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 170 చొప్పున తగ్గింది. హైదరాబాద్‌లో ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 22,510గా ఉంది. విజయవాడలో, విశాఖపట్నంలోనూ ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 22,510గా ఉంది.

టాపిక్