తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kharge's Jab At Pm: ‘నువ్వేమైనా వంద తలలున్న రావణాసురుడివా?’

Kharge's jab at PM: ‘నువ్వేమైనా వంద తలలున్న రావణాసురుడివా?’

HT Telugu Desk HT Telugu

29 November 2022, 19:03 IST

  • Gujarat elections: గుజరాత్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై చేసిన ‘రావణాసుర’ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి తెర తీశాయి.

కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాని మోదీ
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాని మోదీ

కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాని మోదీ

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే పాల్గొన్నారు. అహ్మదాబాద్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది.

Kharge's jab at PM: కార్పొరేషన్ ఎన్నికలను కూడా వదలడం లేదు

దేశ ప్రధాన మంత్రిగా చేయాల్సిన విధులను, బాధ్యతలను ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని ఖర్గే విమర్శించారు. ప్రధానమంత్రి బాధ్యతలను పక్కన బెట్టి, ఎక్కడ ఏ ఎన్నికలు వచ్చినా.. ప్రచారానికి బయల్దేరుతున్నాడని ఎద్దేవా చేశారు. ‘కార్పొరేషన్, ఎమ్మెల్యే, ఎంపీ.. ఎన్నిక ఏదైనా ప్రచారం మాత్రం తానే చేస్తున్నాడు’ అని ఖర్గే వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

Kharge's Ravanasura jab at PM:రావణాసురుడా?

ప్రతీ ప్రచారంలోనూ ప్రధాని మోదీ స్వీయ ప్రశంసలే చేసుకుంటున్నాడని, తనను చూసి ఓటేయమని కోరుతున్నారని ఖర్గే విమర్శించారు. ‘‘ఎవరినీ చూడొద్దు. నన్ను చూడండి. నా ముఖం చూసి ఓటేయండి అంటున్నావు. ఎన్ని సార్లు చూడాలి మీ ముఖం? ఎన్ని రూపాలు ఉన్నాయి మీకు? మీకేమైనా వంద తలలున్నాయా రావణాసురిడిలా?’’ అని ఖర్గే మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వీడియోను కాంగ్రస్ ట్విటర్ లో షేర్ చేసింది.

BJP reacts at Kharge's jab: గుజరాతీలను అవమానించడమే..

ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ మరోసారి గుజరాతీయులను అవమానించిందని విమర్శించింది. ‘‘గుజరాత్ ముద్దు బిడ్డ ప్రధాని మోదీని అవమానించడం ద్వారా కాంగ్రెస్ గుజరాత్ ప్రజలందరినీ అవమానించింది. కాంగ్రెస్ పార్టీ గుజరాత్ కు, గుజరాత్ ప్రజలకు వ్యతిరేకమని మరోసారి నిరూపణ అయింది’’ అని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ విమర్శించారు. కాంగ్రెస్ గుజరాత్ ప్రజలు మరోసారి తిరస్కరించడం ఖాయమన్నారు.

BJP reacts at Kharge's jab: ఎన్నికల వేడిని తట్టుకోలేకపోతున్నారు

గుజరాత్ లో ఎన్నికల వేడిని, బీజపీకి లభిస్తున్న ఆదరణను కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని బీజేపీ ఐటీ సల్ చీఫ్ అమిత్ మాలవీయ విమర్శించారు. అందుకే, నియంత్రణ కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గుజరాత్ ముద్దుబిడ్డను అవమానించిన కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం నేర్పాలని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా గుజరాతీలకు పిలుపునిచ్చారు.