తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Digital Transactions: ఇక డిజిటల్ లావాదేవీలదే హవా: పీఎం మోదీ

Digital transactions: ఇక డిజిటల్ లావాదేవీలదే హవా: పీఎం మోదీ

HT Telugu Desk HT Telugu

21 February 2023, 14:39 IST

  • Digital transactions: దేశంలో నగదు లావాదేవీల కన్నా డిజిటల్ లావాదేవీల సంఖ్యే ఎక్కువగా ఉండే పరిస్థితి తర్వలోనే రానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వ్యాఖ్యానించారు. 

ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ (ANI)

ప్రధాని నరేంద్ర మోదీ

Digital transactions: డిజిటల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో భారత్ ప్రపంచదేశాల కన్నా చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. యూపీఐ (Unified Payments Interface UPI) విధానం ద్వారా నగదు బదిలీ దేశంలో ఇప్పుడు చాలా కామన్ గా మారింది. ఇప్పుడు వీధి వ్యాపారాల నుంచి లక్షల లావాదేవీలు జరిగే బిజినెస్ ల వరకు క్యూఆర్ కోడ్ (QR code) డిస్ ప్లే అత్యంత ఆవశ్యకంగా మారింది.

Digital transactions to exceed cash: నగదును దాటేస్తుంది..

ఈ నేపథ్యంలో, త్వరలోనే భారత్ లో నగదు లావాదేవీల కన్నా యూపీఐ లావాదేవీల (digital transaction) సంఖ్య ఎక్కువ కానుందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) వ్యాఖ్యానించారు. యూపీఐ (UPI), సింగపూర్ పే నౌ (PayNow of Singapore) ల మధ్య అనుసంధానానికి సంబంధించిన క్రాస్ బోర్డర్ కనెక్టివిటీని మంగళవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమంలో సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ కూడా పాల్గొన్నారు. యూపీఐ (UPI), సింగపూర్ పే నౌల (PayNow of Singapore) మధ్య తొలి డిజిటల్ ట్రాన్సాక్షన్ (digital transaction) ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత్ దాస్, మానెటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (MAS) మేనేజింగ్ డైరెక్టర్ రవి మెనన్ ల మధ్య జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2022 లో 74 బిలియన్ల యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగాయని, వాటి విలువ రూ. 126 లక్షల కోట్లు అని మోదీ (PM Modi) వెల్లడించారు. భారత్ లో యూపీఐ (UPI) పేమెంట్ సిస్టమ్ భద్రత విషయంలో అత్యున్నతంగా రూపొందిందన్నారు. యూపీఐ (UPI), సింగపూర్ పే నౌల (PayNow of Singapore) మధ్య డిజిటల్ ట్రాన్సాక్షన్స్ (digital transaction) కు వీలు కలగడం వల్ల ఇరుదేశాల్లోని పౌరులకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా సింగపూర్ లోని భారతీయులకు సులువుగా మనీ ట్రాన్స్ ఫర్ సాధ్యమవుతుంది.