తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indira Gandhi Death Anniversary: ఇందిరా గాంధీకి నివాళి

Indira Gandhi death anniversary: ఇందిరా గాంధీకి నివాళి

HT Telugu Desk HT Telugu

31 October 2022, 9:54 IST

    • Indira Gandhi death anniversary: ఇందిరాగాంధీకి కాంగ్రెస్ శ్రేణులు నివాళులు అర్పించాయి.
నవంబరు 3, 1984న ఇందిరా గాంధీ అంత్యక్రియలు, చిత్రంలో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ తదితరులు SN Sinha/HT ARCHIVE
నవంబరు 3, 1984న ఇందిరా గాంధీ అంత్యక్రియలు, చిత్రంలో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ తదితరులు SN Sinha/HT ARCHIVE (SN Sinha/HT ARCHIVE)

నవంబరు 3, 1984న ఇందిరా గాంధీ అంత్యక్రియలు, చిత్రంలో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ తదితరులు SN Sinha/HT ARCHIVE

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ సోమవారం ఆమెకు నివాళులర్పించింది. ఆమె చూపిన ప్రేమను, ఆచరించిన విలువలను తన గుండెల్లో నింపుకున్నానని రాహుల్ గాంధీ అన్నారు. ఇందిరా గాంధీ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని, ఈ దేశం విచ్ఛిన్నం కానివ్వనని రాహుల్ గాంధీ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, ఇతర పార్టీ సీనియర్ నేతలు ఇందిరా గాంధీ శక్తి స్థల్ స్మారక చిహ్నం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.

‘భారత తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అమరులైన రోజు సందర్భంగా ఆమెకు నా నివాళులు. వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ లేదా సైనిక శక్తి ఏదైనా సరే, భారతదేశాన్ని బలమైన దేశంగా మార్చడంలో ఇందిరాజీ చేసిన కృషి సాటిలేనిది’ అని ఖర్గే హిందీలో ట్వీట్ చేశారు.

రాహుల్ గాంధీ హిందీలో చేసిన ట్వీట్‌లో ‘నానమ్మా, నేను మీ ప్రేమ, విలువలను నా హృదయంలో మోస్తున్నాను. మీరు మీ జీవితాన్ని త్యాగం చేసిన భారతదేశాన్ని నేను విచ్ఛిన్నం చేయనివ్వను’ అని అన్నారు.

బంగ్లాదేశ్ విముక్తి నుండి హరిత విప్లవానికి నాంది పలికే వరకు ఇందిరాగాంధీ దేశాన్ని నడిపించారని కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఒక పోస్ట్‌లో పేర్కొంది.

‘కష్టాల్లో ఆమె చూపిన దృఢ చిత్తం, దేశ అభివృద్ధి కోసం సాటిలేని ఆమె దృష్టికి మేం వందనం చేస్తున్నాం’ అని పార్టీ పేర్కొంది.

1984లో ఇదే రోజున అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె ఇద్దరు సెక్యూరిటీ గార్డులు హత్య చేశారు.