తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Another Covid Wave In China: చైనాలో మళ్లీ కొరోనా కల్లోలం; జూన్ చివరినాటికి వారానికి 6.5 కోట్ల కేసులు

Another Covid wave in China: చైనాలో మళ్లీ కొరోనా కల్లోలం; జూన్ చివరినాటికి వారానికి 6.5 కోట్ల కేసులు

HT Telugu Desk HT Telugu

25 May 2023, 21:00 IST

  • Covid wave in China: పుట్టినిల్లు చైనాలో కొరోనా మరోసారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ బీబీ (omicron XBB) తో దేశంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జూన్ చివరి నాటికి వారానికి 6.5 కోట్ల కొరోనా కేసులు నమోదయ్యే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Bloomberg)

ప్రతీకాత్మక చిత్రం

చైనాలో కొరోనా వైరస్ మరోసారి విరుచుకుపడుతోంది. ఏప్రిల్ నుంచి దేశంలో కొరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దాంతో, కొరోనాను నిరోధించే టీకాల నిల్వలను పెంచే దిశగా చైనా ముమ్మర చర్యలను ప్రారంభించింది. అలాగే, ఎక్స్ బీబీ వేరియంట్ ను ఎదుర్కోగల టీకా ను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించింది.

ట్రెండింగ్ వార్తలు

Cricket ball : జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Omicron XBB: ఒమిక్రాన్ ఎక్స్ బీబీ వేరియంట్

ఒమిక్రాన్ ఎక్స్ బీబీ (Omicron XBB) వేరియంట్ కారణంగా చైనాలో కోవిడ్ 19 కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు గుర్తించారు. ఏప్రిల్ లో ప్రారంభమైన ఈ కేసుల విజృంభణ మే లో వారానికి 4 కోట్ల మందికి సోకే ప్రమాదకర స్థాయికి చేరింది. జూన్ నెలాఖరు నాటికి వారానికి 6.5 కోట్లమందికి ఈ కోవిడ్ 19 సోకే ప్రమాదముందని చైనాలోని శ్వాసకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఝాంగ్ నాన్షన్ గ్వాంగ్ఝా నగరంలో జరిగిన ఒక బయోటెక్ సదస్సులో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, దేశంలో అవసరమైన స్థాయిలో టీకాలను నిల్వ చేసుకునే దిశగా చైనా చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు,చైనాలో కరోనా కేసుల సంఖ్యను ప్రతీ వారం వెల్లడించడాన్ని కూడా చైనా ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ నిలిపేసింది. దాంతో, దేశంలో నమోదవుతున్న కేసుల సంఖ్య కచ్చితంగా తెలిసే అవకాశం లేకుండా పోయింది. గత సంవత్సరం చివర్లో చైనాలో ప్రతీరోజు సుమారు 3.7 కోట్ల మంది కొరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో చైనాలోని ఆస్పత్రులు నిండిపోయాయని, మృతదేహాలతో స్మశాన వాటికలు నిండిపోయాయని వార్తలు వచ్చాయి.

టాపిక్