తెలుగు న్యూస్  /  National International  /  Central Bank Of India To Recruit 5000 Apprentice Posts, Direct Link Here

Central Bank of India recruitment: సెంట్రల్ బ్యాంక్ లో 5000 అప్రెంటిస్ పోస్ట్ లు

HT Telugu Desk HT Telugu

23 March 2023, 18:05 IST

  • Central Bank of India recruitment: 5 వేల అప్రెంటిస్ (Apprentice) పోస్ట్ ల భర్తీకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) నోటిఫికేషన్ జారీ చేసింది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Central Bank of India recruitment: అప్రెంటిస్ (Apprentice) పోస్ట్ ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ centralbankofindia.co.in నుంచి దరఖాస్తు చేసుకోవాలి.

Central Bank of India recruitment: మొత్తం 5 వేల పోస్ట్ లు..

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 వేల అప్రెంటిస్ పోస్ట్ (Apprentice) లను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) భర్తీ చేయనుంది. ఈ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 3, 2023. ఏప్రిల్ రెండో వారంలో కానీ, మూడో వారంలో కానీ రాత పరీక్ష ఉంటుంది. విద్యార్హతలు, పరీక్ష విధానం మొదలైన వివరాల కోసం అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) అధికారిక వెబ్ సైట్ centralbankofindia.co.in లోని సవివర నోటిఫికేషన్ ను చూడాలి.

Central Bank of India recruitment: అర్హతలు..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) లో అప్రెంటిస్ పోస్ట్ (Apprentice) లకు అప్లై చేసుకోవడానికి అవసరమైన కనీస విద్యార్హత ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ (Graduation) కలిగి ఉండాలి. అలాగే, అభ్యర్థుల వయస్సు (age limit) 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ ఆన్ లైన్ రాత పరీక్ష (online written test)) ద్వారా జరుగుతుంది. స్థానిక భాషపై పట్టును పరీక్షిస్తారు. దరఖాస్తు ఫీజు దివ్యాంగులకు రూ. 400, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రూ. 600, ఇతర అన్ని కేటగిరీలకు రూ. 800 చెల్లించాలి. ఈ ఫీజుకు జీఎస్టీ అదనం.