తెలుగు న్యూస్  /  National International  /  Cabinet Approves Revision In Nutrient-based Subsidy Rates For Fertilizers

Cabinet decisions: ఎరువుల సబ్సీడీ రేట్లపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

HT Telugu Desk HT Telugu

17 May 2023, 19:09 IST

  • రైతులకు నాణ్యమైన ఎరువులను సబ్సీడీ ధరలకే అందజేసే లక్ష్యంలో భాగంగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పొటాషియం, పాస్ఫరస్ ఎరువుల సబ్సీడీ రేట్లలో మార్పులు చేయడానికి ఆమోదం తెలిపింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎరువులకు వాటి పోషకాధార సబ్సీడీ (nutrient-based subsidy NBS) ధరలను సవరించడానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. కొత్త సబ్సీడీ రేట్లు పాస్ఫరస్, పొటాషియం (phosphatic and potassic P&K) ఎరువులకు రబీ సీజన్ తో పాటు ఖరీఫ్ సీజన్ కు వర్తిస్తాయి. రైతులకు నాణ్యమైన ఎరువులను సబ్సీడీ ధరలకే అందజేసే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

రూ. 38వేల కోట్లు..

ఈ సబ్సీడీకి గానూ కేంద్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ కు రూ. 38 వేల కోట్లను వెచ్చిస్తోంది. రైతులకు తక్కువ ధరకు పోషక విలువలతో కూడిన ఎరువులను అందించే లక్ష్యంతో ఈ సబ్సీడీ పథకాన్ని 2010లో ప్రారంభించారు. తాజాగా, ఆ ఎరువుల సబ్సీడీ రేట్లను సవరించడానికి కేంద్రం ఆమోదం తెలిపింది.

ప్రయోజనాలు.

కేంద్రం నిర్ణయం వల్ల రైతులకు ఈ ఖరీఫ్ సీజన్ లో అందుబాటు ధరలో, సరైన సమయానికి నాణ్యమైన డీఏపీ (DAP), ఇతర పాస్ఫరస్, పొటాషియం (P&K) ఎరువులు లభిస్తాయి. ప్రస్తుతం యూరియా బ్యాగ్ ధర రూ. 276 గా, డీఏపీ ధర రూ. 1350 గా ఉంది.