తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bill Gates: ప్రధాని మోదీపై బిల్ గేట్స్ ప్రశంసల వర్షం

Bill Gates: ప్రధాని మోదీపై బిల్ గేట్స్ ప్రశంసల వర్షం

HT Telugu Desk HT Telugu

04 March 2023, 17:12 IST

  • Bill Gates: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ పై, ప్రధాని మోదీపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. 

ప్రధాని మోదీ తో బిల్ గేట్స్
ప్రధాని మోదీ తో బిల్ గేట్స్ (Narendra Modi Twitter)

ప్రధాని మోదీ తో బిల్ గేట్స్

Bill Gates praises PM Modi: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరల్లో ఒకరైన బిల్ గేట్స్ భారత ప్రధానితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన భారత్ పై ప్రశంసలు కురిపించారు. అన్ని రంగాల్లో భారత్ దూసుకుపోతోందని, ప్రపంచానికే ఇప్పుడు భారత్ దిక్సూచిగా మారిందని వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు

Cricket ball : జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Bill Gates on Corona vaccines: చవకగా టీకాలు..

భారత్ సురక్షితమైన, నాణ్యమైన, ప్రభావవంతమైన, చవకైన టీకాలను ఉత్పత్తి చేసి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రజల ప్రాణాలను కాపాడుతోందని ప్రశంసించారు. అందులో కొన్ని వ్యాక్సిన్ల ఉత్పత్తిలో తమ గేట్స్ ఫౌండేషన్ సహకారం కూడా ఉందన్నారు. కొరోనా మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ల అభివృద్ధిలో భారత్ చూపిన చొరప ప్రపంచ దేశాలకు మార్గదర్శకమన్నారు. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు భారత దేశం పరిష్కారంగా కనిపిస్తోందన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక వసతులు, టెక్నాలజీ, వ్యవసాయం.. అన్ని రంగాల్లో సమతుల అభివృద్ధిని భారత్ సాధిస్తోందన్నారు. కొరోనాపై పోరుకు రూపొందించిన కోవిన్ (Co-WIN) ఓపెన్ సోర్స్ ప్లాట్ ఫామ్ (open-source platform) భారతదేశ కొవిడ్ 19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కు ఎంతో ఉపయోగపడిందన్నారు. ఆధార్ సహాయంతో ప్రజలనందరిని సమ్మిళిత ఆర్థికాభివృద్ధిలో భాగం చేయడం భారత్ ఘనత అని తన బ్లాగ్ లో బిల్ గేట్స్ వివరించారు.

Bill Gates praises india: అద్బుతమైన ప్రజారోగ్య వ్యవస్థ

కొరోనా మహమ్మారి సమయంలోనూ, ఆ తరువాత కూడా ప్రధాని మోదీతో తరచూ టచ్ లో ఉన్నానని గేట్స్ తెలిపారు. కోవిడ్ 19 వ్యాక్సిన్ల అభివృద్ధిలో గేట్స్ ఫౌండేషన్ పాలు పంచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. భారత్ లో ఉన్న సమర్ధవంతమైన ప్రజారోగ్య వ్యవస్థ కారణంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా, విజయవంతంగా దేశ పౌరులకు 2.2 కోట్ల డోసుల కొరోనా టీకాలను ఇవ్వగలిగిందన్నారు.