తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Piyush Goyal Criticises Rahul At Htls: ‘‘రాహుల్ గాంధీకి ఆ గుండె ధైర్యం లేదు’’

Piyush Goyal criticises Rahul at HTLS: ‘‘రాహుల్ గాంధీకి ఆ గుండె ధైర్యం లేదు’’

HT Telugu Desk HT Telugu

12 November 2022, 17:58 IST

  • Piyush Goyal criticises Rahul at HTLS: హిందుస్తాన్ టైమ్స్ గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్(Hindustan Times Leadership Summit -HTLS)లో శనివారం కేంద్ర మంత్రి పియూష్ గోయల్ పాల్గొన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఈ సందర్భంగా ఆయన జోస్యం చెప్పారు. 

కేంద్ర మంత్రి పియూష్ గోయల్
కేంద్ర మంత్రి పియూష్ గోయల్ (PTI file)

కేంద్ర మంత్రి పియూష్ గోయల్

Piyush Goyal criticises Rahul at HTLS: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి ఘన విజయం సాధించబోతోందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్(Hindustan Times Leadership Summit -HTLS)లో శనివారం ఆయన పాల్గొన్నారు.

Piyush Goyal criticises Rahul at HTLS: రాహుల్ గాంధీకి ధైర్యం లేదు..

హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రస్తుతం భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనే గుండె ధైర్యం రాహుల్ కు లేదని ఎద్దేవా చేశారు. ‘ఒకవైపు హిమాచల్, గుజరాత్ ల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు, ఒక కాంగ్రెస్ నాయకుడు భారత్ జోడో యాత్ర అంటూ తెలంగాణలో, తమిళనాడులో తిరుగుతున్నారు. గుజరాత్, హిమాచల్ ల్లో ప్రచారం చేసే ధైర్యం ఆయనకు లేదు. ఎందుకంటే, ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని తనకు తెలుసు’’ అని పియూష్ వ్యాఖ్యానించారు.

Piyush Goyal criticises Rahul at HTLS: గుజరాత్ లో..

గుజరాత్ ఎన్నికల్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గానూ, బీజేపీ 150కి పైగా సీట్లను గెలుచుకుంటుందని పియూష్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ తరహాలోనే హిమాచల్ ప్రదేశ్ లోనూ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు. ప్రతీ ఎన్నికల్లో విజేతను మార్చే సంప్రదాయం ఈ సారి కొనసాగదన్నారు. నిజాయతీగా ప్రజాసేవ చేస్తే ఎన్నిసార్లైనా ప్రజలు పట్టం కడతారన్నారు.

Piyush Goyal criticises Rahul at HTLS: ఆప్ అవకాశాలపై..

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి ఆప్ గట్టి పోటీ ఇవ్వడంపై స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు అన్ని పార్టీలకు ఉంటుందని, బీజేపీ అన్ని పార్టీలు పోటీ పడడాన్ని స్వాగతిస్తామని గోయల్ పేర్కొన్నారు. ‘గుజరాత్ లో కాంగ్రెస్ ఖాళీ చేసిన ప్రతిపక్ష హోదాను ఆప్ పొందడానికి ప్రయత్నిస్తోంది’ అన్నారు.