తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Turkey Coal Mine Blast : బొగ్గు గనిలో పేలుడు.. 25మంది మృతి

Turkey coal mine blast : బొగ్గు గనిలో పేలుడు.. 25మంది మృతి

Sharath Chitturi HT Telugu

15 October 2022, 8:58 IST

  • Turkey coal mine blast : టర్కీ బొగ్గు గనిలో సంభవించిన పేలుడుకు 25మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

బొగ్గు గనిలో భారీ పేలుడు
బొగ్గు గనిలో భారీ పేలుడు (via REUTERS)

బొగ్గు గనిలో భారీ పేలుడు

Turkey coal mine blast : టర్కీలోని ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 25మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

స్థానిక మీడియా కథనం ప్రకారం.. బార్టిన్​ తీర ప్రాంతంలో ఉన్న అమస్ర పట్టణంలోని ఓ బొగ్గు గనిలో.. శుక్రవారం సాయంత్రం 6:45 గంటలకు పేలుడు సంభవించింది. పేలుడు సమయంలో గని లోపల 110మందికిపైగా ప్రజలు ఉన్నారు. బొగ్గు గనిలో పేలుడు ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. 25 మృతదేహాలను వెలికి తీశారు. మరికొందరిని రక్షించారు. కాగా.. గనిలోని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో దాదాపు 50మంది కార్మికులు చిక్కుకుని ఉన్నట్టు సమాచారం. వారిని బయటకు తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది.

<p>బొగ్గు గనిలో నుంచి బయటకు తీసిన ఓ కార్మికుడి మృతదేహం</p>

Turkey coal mine blast death toll : పేలుడు జరిగిన బొగ్గు గని పేరు టీటీకే అమస్ర మ్యుస్సెసె ముదుర్లుగు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. అధికారుల ప్రకారం 17మంది గాయపడ్డారు. వీరిలో పలువురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

కారణం ఇదే..!

ఘటనపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు అధికారులు. బొగ్గు గనిలో విష వాయువు లీక్​ అవ్వడంతో పేలుడు సంభవించిందని తేలింది. ఈ విష వాయువును ఫైర్​డాంప్​ అని పిలుస్తారు.

Turkey coal mine explosion : ఘటనపై టర్కీ అధ్యక్షుడు రిసెప్​ ఎర్డోగాన్​ విచారం వ్యక్తం చేశారు. అతి త్వరలోనే ప్రమాదానికి గురైన బొగ్గు గనిని పరిశీలించి, క్షతగాత్రులను కలుస్తారని తెలుస్తోంది.

ఘటనలో విషాదకర దృశ్యాలు బయటకి వచ్చాయి. మృతులు, బాధితుల కుటుంబ సభ్యులు బొగ్గు గని వద్దకు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. తమ బంధువుల ఆచూకీ కోసం గంటల తరబడి ఎదురుచూశారు. తమ వారి మృతదేహాలను చూసి కన్నీరు పెట్టుకున్నారు.

<p>రోదిస్తున్న బాధితుడి బంధువు</p>

టర్కీ బొగ్గు గనుల్లో పేలుడు ఘటనలు చాలా జరిగాయి. 2014లో పశ్చిమ టర్కీ సోమా పట్టణంలోని ఓ బొగ్గు గనిలో సంభవించిన పేలుడుకు 301మంది ప్రాణాలు కోల్పోయారు.