తెలుగు న్యూస్  /  National International  /  Blast Hits Kabul Mosque In Vicinity Of Interior Ministry, Killing 4

Blast hits Kabul mosque: మసీదు లక్ష్యంగా మరో బాంబు పేలుడు

HT Telugu Desk HT Telugu

05 October 2022, 20:39 IST

  • Blast hits Kabul mosque: అఫ్గానిస్తాన్ లో మసీదులు, విద్యా సంస్థలు లక్ష్యంగా బాంబు పేలుళ్లు కొనసాగుతున్నాయి. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Blast hits Kabul mosque: కాబూల్ లో అఫ్గానిస్తాన్ హోం మంత్రిత్వ శాఖ కార్యాలయానికి, కాబూల్ విమానాశ్రయానికి అత్యంత సమీపంలో బుధవారం భారీ బాంబు పేలుడు సంభవించింది.

ట్రెండింగ్ వార్తలు

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

ICSE exam results 2024 : త్వరలో ఐసీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

Blast hits Kabul mosque: నలుగురు మృతి

కాబూల్ లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం సమీపంలోని మసీదులో జరిగిన ఈ బాంబు పేలుడు ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు పాతిక మంది వరకు గాయాలపాలయ్యారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే హోం మంత్రిత్వ శాఖ సమీపంలో ఈ పేలుడు జరగడం గమనార్హం. ఈ మసీదులోకి కూడా ఆ శాఖ ఉద్యోగులే ఎక్కువగా ప్రార్థనల కోసం వెళ్తుంటారు. ఇటీవలి కాలంలో కాబూల్ లో ఇస్లామిస్ట్ మిలిటెంట్లు పలు బాంబు దాడులకు పాల్పడ్డారు.

Blast hits Kabul mosque: ఇటలీ ఎన్జీవో

తమ ఆసుపత్రికి 20 మంది క్షతగాత్రులు వచ్చారని, వారిలో ఇద్దరు చనిపోయారని కాబూల్ లో ఒక ఆసుపత్రిని నిర్వహిస్తున్న ఒక ఇటాలియన్ ఎన్జీవో సంస్థ వెల్లడించింది. కాబూల్ లోని ఒక విద్యాసంస్థలో భారీ పేలుడు సంభవించి 57 మంది చనిపోయి వారం కూడా గడవక ముందే మరో పేలుడు సంభవించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.