తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  120 Russian Missiles Strike Ukraine Cities: ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల వర్షం

120 Russian missiles strike Ukraine cities: ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల వర్షం

HT Telugu Desk HT Telugu

29 December 2022, 17:07 IST

    • Russian missiles strike Ukraine cities ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై రష్యా గురువారం మిస్సైల్స్ తో విరుచుకుపడింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (AP)

ప్రతీకాత్మక చిత్రం

Russian missiles strike Ukraine cities రష్యా గురువారం ఉదయం నుంచి ఉక్రెయిన్ పై దాడులను తీవ్రం చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్, తూర్పున ఉన్న ప్రధాన నగరం ఖార్కివ్, పశ్చిమాన ఉన్న ఎల్వీవ్ లపై క్షిపణుల వర్షం కురిపించింది.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

Russian missiles strike Ukraine cities: 120కి పైగా మిస్సైల్స్

రష్యా మిస్సైల్ దాడులతో (Russian missile attack) కీవ్, ఖార్కివ్, ఎల్వీవ్ నగరాల్లో భారీ విధ్వంసం జరిగింది. ఆయా నగరాల్లోని కీలక మౌలిక వసతుల కేంద్రాలు, పవర్ ప్రాజెక్టులు కేంద్రంగా రష్యా ఈ దాడులు చేసింది. ఈ దాడులతో ఆ నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉక్రెయిన్ ప్రధాన నగరాలు లక్ష్యంగా రష్యా గురువారం 120కి పైగా మిస్సైల్స్ (Russian missile attack) ను ప్రయోగించిందని ఉక్రెయిన్ ప్రకటించింది. మిస్సైల్స్ దాడులు ప్రారంభం కాగానే, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా పౌరులను అప్రమత్తం చేసామని తెలిపింది.

Russia Ukraine war: డ్రోన్లతోనూ..

బుధవారం రాత్రి నుంచే రష్యా దాడు(Russia Ukraine war) లకు సిద్ధమైందని, పేలుడు పదార్ధాలతో కూడిన డ్రోన్లను లక్షిత నగరాలపైకి పంపించింది. ఆ తరువాత, ఆకాశం నుంచి యుద్ధ విమానాల ద్వారా, సముద్రంపైని యుద్ధ నౌకల పై నుంచి మిస్సైల్స్ వర్షం కురిపించింది. గత రెండు వారాల వ్యవధిలో ఇంత తీవ్ర స్థాయిలో రష్యా దాడులు (Russia Ukraine war) చేయడం ఇదే ప్రథమం. రష్యా ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైల్స్ లో చాలావాటిని మార్గమధ్యంలోనే కూల్చేశామని ఉక్రెయిన్ పేర్కొంది.

Russian missiles strike Ukraine cities: ప్రజల అవస్థలు

ఇప్పటికే గడ్డ కట్టే చలిలో ఇబ్బందులు పడుతున్న ఉక్రెయిన్ ప్రజలు రష్యా తాజా దాడులతో (Russia Ukraine war) మరిన్ని అవస్థల పాలు అవుతున్నారు. విద్యుత్ సరఫరా, నీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రష్యా దాడుల్లో (Russian missile attack) కీవ్ లో 14 ఏళ్ల బాలిక సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ వెల్లడించింది. పోలండ్ సరిహద్దుల్లోని ఎల్వీవ్ నగరంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది.