తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Milk Adulteration । మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? పాలను కల్తీ చేసినట్లు ఇలా గుర్తించవచ్చు!

Milk Adulteration । మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? పాలను కల్తీ చేసినట్లు ఇలా గుర్తించవచ్చు!

HT Telugu Desk HT Telugu

01 June 2023, 12:01 IST

    • Milk Adulteration: రోజూ పాలు తాగితే ఆరోగ్య చాలా ప్రయోజనాలు ఉంటాయనేది వాస్తవమే, కానీ మనం తాగే పాలు స్వచ్ఛమైనవేనా, కాదా? అనేది ఇక్కడ ముఖ్యం. కల్తీ పాలను పరీక్షించడానికి ఇక్కడ కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి.
Milk Adulteration
Milk Adulteration (Unsplash)

Milk Adulteration

Milk Adulteration: మనం ప్రతిరోజూ తీసుకునే ఆహార పదార్థాలలో కల్తీ జరగటం అనేది ఒక సమస్యగా మారింది. ఉదయం తాగే పాల దగ్గర్నించీ, తినే తిండి వరకు కల్తీ జరుగుతుంది. నూనె, తేనే అనే తేడా లేకుండా అన్నింటినీ కల్తీ చేస్తున్నారు. మనం ఎంత ఖర్చు పెట్టి కొనుగోలు చేసినా, కల్తీ చేసే వారి కక్కుర్తికి అడ్డూ అదుపు లేకుండా పోతుంది. అయితే అన్నింటికంటే ముఖ్యంగా పాలు కల్తీ చేయడం అందరికీ ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే పాలు ఇంట్లో చిన్నపిల్లల దగ్గర్నించీ, ముసలి వారి వరకు అందరూ తాగుతారు. పాలు ఎంతో పోషకాలతో నిండిని ఆహారంగా మనం భావిస్తాం. అనారోగ్యంతో ఉన్నవారికి కూడా పాలు తాగిస్తారు. రోజూ పాలు తాగితే ఆరోగ్య చాలా ప్రయోజనాలు ఉంటాయనేది వాస్తవమే, కానీ మనం తాగే పాలు స్వచ్ఛమైనవేనా, కాదా? అనేది ఇక్కడ ముఖ్యం.

కల్తీ పాలు తాగటం వలన అవయవాలు పనిచేయకపోవడం, గుండెకు సంబంధించిన సమస్యలు, క్యాన్సర్, కంటి చూపు క్షీణించడం, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

కల్తీని ఎలా తనిఖీ చేయాలి? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రకారం, ఆహార పదార్థాల కల్తీలను గుర్తించడానికి రాపిడ్ టెస్టింగ్ (DART) వంటి పరీక్షలతో కల్తీ జరిగిందా లేదా అనేది గుర్తించవచ్చు. ఆ పదార్థం కృత్రిమమైనదా? హానికర రంగులు, రసాయనాలు ఏమైనా కలిపారా? పదార్థం నాణ్యత వంటి సాధారణ కల్తీలను ఈ పరీక్షలతో తెలుసుకోవచ్చు. కల్తీ పాలను పరీక్షించడానికి ఇక్కడ కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి.

పరీక్ష 1: పాలలో నీరు

సాదా గాజు వంటి పాలిష్ చేసిన, ఏటవాలు ఉపరితలంపై రెండు మూడు చుక్కల పాలు వేయండి.

స్వచ్ఛమైన కదలవు లేదా నెమ్మదిగా ప్రవహిస్తాయి, వెనక తెల్లటి తెల్లటి జాడను గమనించవచ్చు.

పాలలో నీళ్లు ఎక్కువ కలిపి ఉంటే అవి వేగంగా ప్రవహిస్తాయి, వెనక తెల్లటి తెల్లటి జాడ కనిపించదు.

పరీక్ష 2: పాలలో డిటర్జెంట్

5-10 మిల్లీలీటర్ల పాలను, సమాన పరిమాణంలో నీటిని తీసుకోండి

మిశ్రమాన్ని బాగా షేక్ చేయండి. నురుగు ఏర్పడితే పాలు డిటర్జెంట్‌తో కల్తీ చేసినట్లు

స్వచ్ఛమైన పాలు నురుగుకు పలుచని పొర ఉంటుంది

పరీక్ష 3: పౌడర్ పాలను ఎలా గుర్తించవచ్చు?

2-3 మిల్లీలీటర్ల పాలను 5 మిల్లీలీటర్ల పాలను నీటితో మరిగించండి

చల్లారిన తర్వాత 2-3 చుక్కల అయోడిన్ టింక్చర్ కలపండి

పాలు నీలి రంగులోకి మారితే ఆ పాలలో పిండి లేదా పౌడర్ కలిపినట్లు.

ఈరోజు ప్రపంచ పాల దినోత్సవం (World Milk Day) . ఆహారంగా పాలు తీసుకోవడం, పాలు తాగితే కలిగే ప్రయోజనాల ప్రాముఖ్యతను గుర్తించడం, పాడి పరిశ్రమ మరింత వృద్ధిని ప్రోత్సహించడం కోసం ప్రతీ ఏడాది జూన్ 1వ తేదీన పాల దినోత్సవంగా పాటిస్తారు. ఈ సందర్భంగా ఆహార కల్తీ లేని ప్రపంచాన్ని కోరుకుందాం.