Divorce Photoshoot : ఇదో రకం కొత్త ముచ్చట.. విడాకుల ఫొటో షూట్
14 April 2023, 11:24 IST
- Divorce Photoshoot : ప్రపంచంలో కొన్ని కొన్ని కొత్త విషయాలు జరుగుతుంటాయి. రానురాను అవే ట్రెండ్ అయిపోతాయి. ఇప్పుడిప్పుడే ఓ విషయం ట్రెండ్ అవుతోంది. అదేంటో తెలుసా? డివోర్స్ ఫొటో షూట్. నమ్మట్లేదా? నిజమండి బాబూ.. విడాకుల ఫొటో షూట్స్ కూడా జరుగుతున్నాయి.
విడాకుల ఫొటో షూట్
విడాకుల ఆహ్వానం(Divorce Invitation) గురించి వినే ఉంటారు. ఓ తెలుగు సినిమాలోనూ ఈ కాన్సెప్ట్ ఉంటుంది. డివోర్స్ ఇన్విటేషన్ కొట్టించి.. అందరికీ పంచేస్తుంది హీరోయిన్. అయితే బయట కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. విడాకుల ఆహ్వానం, విడాకుల పార్టీలు(Divorce Party) జరిగినవి వినే ఉంటాం. అయితే పుర్రెకో బుద్ధి అనే సామెత ఉంది కదా. దానికి తగ్గట్టుగానే ఓ మహిళ చేసింది. ట్రెండ్ మారుతుంది కదా.. ఇప్పుడు కొత్తగా విడాకుల ఫొటో షూట్(Divorce Photoshoot) అనేది మెల్లమెల్లగా పాకుతోంది. విదేశాల్లో ఇప్పటికే మెుదలైంది.
ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్స్(Pre Wedding Photo Shoots), బేబీ బంప్స్ ఫొటో షూట్స్ ఇప్పుడు ట్రెండింగ్. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా.. కొన్ని వింతగా ఉంటాయి. ఎంతలా అంటే.. జనాలకు చిరాకు తెప్పించేలా ఉన్నాయి. ఇక ఇప్పుడీ ట్రెండ్ డివోర్స్ వరకూ వచ్చింది. ఇప్పుడు విడాకులు తీసుకున్నా.. ఓ సెలబ్రేషన్. ఫొటో షూట్ చేస్తున్నారు. పెళ్లి కార్డు కాల్చేస్తున్నారు. పెళ్లి బట్టలు తగలబెడుతున్నారు. విదేశాల్లో ఈ ట్రెండ్ మెుదలైంది. ఇంకా ఇండియాలోకి అయితే రాలేదు. ఏమో చెప్పలేం భవిష్యత్ లో రావొచ్చు.
పెళ్లికి ముందు.., పెళ్లి సమయంలో ఫొటో షూట్స్(Photoshoots) అందరికీ తెలుసు. కొత్తగా డివోర్స్ ఫొటో షూట్స్ కూడా మెుదలయ్యాయి. అంటే ఎంత సంతోషంగా ఒక్కటవుతారో.. అంతే ఆనందంగా.. విడిపోవాలన్న మాట. ఓ అమ్మాయి ఇలానే.. విడాకుల ఫొటో షూట్ చేసింది. ఇప్పుడది ట్రెండ్ అవుతోంది.
లారెన్ బ్రూక్ అనే మహిళ విడాకుల ఫొటో షూట్ చేసింది. అయితే ఆమె రెడీ అయిన విధానం చూస్తే.. మాత్రం ఆశ్యర్చం వేస్తుంది. అందంగా రెడీ అయి.. ఫొటోలకు ఫోజులిచ్చింది. పెళ్లి దుస్తుల్ని, ఫొటోల్ని కాల్చి వేసింది. ఇప్పుడు ఈ విడాకుల ఫొటోలు వైరల్(Photos Viral) అవుతున్నాయి. విడాకులు తీసుకుంటున్నట్లు రాసి ఉన్న బోర్డుని పట్టుకుంది. వివాహ సమయంలో వేసుకునే కొంగును కాల్చిపారేసింది. అంతేకాదు.. పెళ్లి సమయంలో తీసుకున్న ఫొటో ఫ్రేమ్ ను పగలగొట్టేసింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో(Social Media) షేర్ చేసింది.
ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. విడాకులు తీసుకోవడం ద్వారా కలిగే బాధ నుంచి బయటపడేందుకు సరైన పని చేసిందని కొంతమంది నెటిజన్లు కామెంటుతున్నారు. మరికొంతమంది ఇలా చేయడం దారుణమంటున్నారు. ఏది ఏమైననా.. లారెన్ బ్రూక్ విడాకుల ఫొటో షూట్ మాత్రం వైరల్ అవుతోంది.