Naresh -Pavitra Lokesh: నరేష్-పవిత్రల 'మళ్లీ పెళ్లి' గురించి అదిరిపోయే అప్డేట్.. ఏంటో లుక్కేయండి?
Naresh -Pavitra Lokesh: సీనియర్ నటులు నరేష్-పవిత్రా లోకేష్ ప్రేమ వ్యవహారం గురించి తెలిసిన విషయమే. త్వరలో నే పెళ్లి కూడా చేసుకుంటామని ప్రకటించిందీ జోడీ. తాజాగా మళ్లీ పెళ్లిపై గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది.
Naresh -Pavitra Lokesh: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ లవ్ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉంటున్నారు. తమ ప్రేమను త్వరలోనే పెళ్లిగా మారుస్తామని ఓ వీడియోను కూడా విడుదల చేశారు. అయితే ఇటీవల కాలంలో పవిత్ర, నరేష్ వివాహం చేసుకుంటున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలైంది. అయితే ఇది నిజమైంది కాదు. సినిమా కోసం వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నట్లు నటించారు. ఈ సినిమా పేరే మళ్లీ పెళ్లి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
నరేష్ నటించిన మళ్లీ పెళ్లి చిత్ర టీజర్‌ను ఏప్రిల్ 13న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. పెద్ద వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రం కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ మేరక్ నరేష్ ట్విటర్ వేదికగా స్పందించారు.
మళ్లీ పెళ్లి చిత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని తెలిపారు. అంతేకాకుండా ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని స్పష్టం చేశారు. జయసుధ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన మళ్లీ పెళ్లి చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తురు. నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తుండగా.. అరుల్ దేవ్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడ భాషలోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది. వేసవి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
టాపిక్