Mangalagiri AIIMS: కృష్ణాజలాలతో మంగళగిరి ఎయిమ్స్‌కు తీరనున్న మంచి నీటికష్టాలు… ఐదేళ్లుగా తీవ్ర నీటి ఎద్దడి
Mangalagiri AIIMS: విభజన హామీల్లో భాగంగా మంగిళగిరిలో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌కు ఐదేళ్లుగా తాగునీటి కష్టాలు ఎదుర్కొంటోంది. ఎన్డీఏ ప్రభుత్వం కృష్ణా నది నుంచి నేరుగా పైప్‌లైన్ల నిర్మాణం చేపట్టడంతో త్వరలో నీటి కష్టాలు తీరనున్నాయి.
Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్ కు మంచి నీటి కష్టాలు తీరనున్నాయి. గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీటి సరఫరాను నిర్లక్ష్యం చేయడంతో విద్యార్థులు, వైద్యులు, రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ట్యాంకర్లతో బకింగ్ హామ్ కాలువ నుంచి ఎయిమ్స్‌కు నీటిని సరఫరా చేసేవారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో ఎయిమ్స్ సేవలుకు కూడా అటంకాలు ఎదురయ్యేవి. కేంద్ర వైద్య శాఖ మంత్రి స్వయంగా పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని నీటి కొరతను నివారించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనరే ఎయిమ్స్ సిబ్బంది,పేషెంట్ లకు శుద్ధమైన నీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గుంటూరు ఛానెల్,ఆత్మకూరు చెరువు నుంచి 5 కిమి మేర పైప్ లైన్ ల నిర్మాణం పూర్తి చేశారు. పైపుల ద్వారా వచ్చిన నీటిని ఎయిమ్స్ ఆవరణలోనే నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేలా ప్లాంట్ల ఏర్పాటు చేశారు.
గత ప్రభుత్వంలో పైప్ లైన్ నిర్మాణం, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ల నిర్మాణ పనులను నిలిపివేయడంతో సమస్యలు తలెత్తాయి. ప్రతి రోజూ కృష్ణానది నుంచి 25 లక్షల లీటర్ల శుద్ధమైన నీరు అందించేలా 8 కోట్లతో ఫిల్టర్ బెడ్లు,ఇతర నిర్మాణ పనులు చేపట్టారు. ఈ నెల 15 లోగా పనులు పూర్తయ్యేలా చూడాలని గుంటూరు పబ్లిక్ హెల్త్ విభాగాన్ని మంత్రి నారాయణ ఆదేశించారు.
మంగళగిరి ఎయిమ్స్ కు త్వరలోనే నీటి కష్టాలు తీరనున్నాయి. ఎయిమ్స్ ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇంతవరకూ నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు..గత ప్రభుత్వం కూడా ఎయిమ్స్ కు నీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ఇప్పటివరకూ ఎయిమ్స్ సిబ్బంది,అక్కడికి వచ్చే రోగులు,ఇతర ప్రజల అవసరాలకు తగినట్లుగా తాగునీరు అందడం లేదు.
గుంటూరు చానల్,ఆత్మకూరు చెరువుల నుంచి ఎయిమ్స్ కు నీటి సరఫరా చేయాలని నిర్ణయించినప్పటికీ దానికి సంబంధించిన పనులు మాత్రం పెండింగ్ లోనే ఉన్నాయి.దీంతో ప్రతిరోజూ సుమారు 3 లక్షల లీటర్ల తాగునీటిని ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిమ్స్‌లో నీటి కష్టాలు తీర్చేలా పనులు చేపట్టారు. గుంటూరు ఛానల్,ఆత్మకూరు చెరువు నుంచి ఎయిమ్స్ వరకూ నీటిని సరఫరా చేసేందుకు పైప్ లైన్ల నిర్మాణం పూర్తి చేసింది. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. పైప్ లైన్ల ద్వారా వచ్చిన నీటిని పూర్తిగా శుద్ది చేసి సరఫరా చేసేలా సంపులు,ఫిల్టర్ బెడ్ లు నిర్మాణం వేగంగా జరుగుతున్నాయి.
ప్రతి రోజూ 25 లక్షల లీటర్ల శుద్దమైన నీటిని సరఫరా చేసేలా వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టారు. ఈనెల 15లోగా పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులతో పాటు కాంట్రాక్టర్ కు మంత్రి ఆదేశించారు.