Lakshmi Devi: సాయంత్రం ఇంటి బయట ఎందుకు కూర్చోకూడదు, శాస్త్రం ఏం చెప్తోంది?-what happens if we sit outside of the house at evening will lakshmi devi get angry ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lakshmi Devi: సాయంత్రం ఇంటి బయట ఎందుకు కూర్చోకూడదు, శాస్త్రం ఏం చెప్తోంది?

Lakshmi Devi: సాయంత్రం ఇంటి బయట ఎందుకు కూర్చోకూడదు, శాస్త్రం ఏం చెప్తోంది?

Peddinti Sravya HT Telugu

Lakshmi Devi: కొన్ని పొరపాట్లు చేయడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి, మన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే చాలా మంది సాయంత్రం పూట ఇంటి బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంటి బయట కూర్చుని ఫోన్ చూసుకోవడం లేదంటే తినడం వంటివి కూడా చేస్తూ ఉంటారు. నిజానికి సాయంత్రం పూట ఇంటి ముఖద్వారం బయట కూర్చోకూడదట.

Lakshmi Devi: సాయంత్రం ఇంటి బయట ఎందుకు కూర్చోకూడదు, శాస్త్రం ఏం చెప్తోంది? (pinterest)

ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి ఇంట కొలువై ఉండాలని, ఆర్థిక బాధలు ఏమీ లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటుంటారు. అయితే, కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని పొరపాట్లు చేయడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి, మన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే చాలా మంది సాయంత్రం పూట ఇంటి బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంటి బయట కూర్చుని ఫోన్ చూసుకోవడం లేదంటే తినడం వంటివి కూడా చేస్తూ ఉంటారు. నిజానికి సాయంత్రం పూట ఇంటి ముఖద్వారం బయట కూర్చోకూడదట.

ఇంటి బయట సాయంత్రం పూట ఎందుకు కూర్చోకూడదు?

సాయంత్రం అయితే చాలు మన ఇంట్లో ఉండే పెద్దలు ఇంటి బయట నుంచి లోపలికి వెళ్ళిపోమని చెప్తారు. ఇంటి బయట అలా కూర్చోవద్దని అంటూ ఉంటారు. అలా కూర్చోవడం మంచిది కాదని చెప్తూ ఉంటారు. అయితే, ఎందుకు అలా కూర్చోకూడదు?, దాని వెనక ఏమైనా అర్థం ఉందా? ఇంటి బయట ఎందుకు కూర్చోకూడదు? శాస్త్రం ఏం చెప్తోంది అనేది చూద్దాం. శాస్త్రాల్లో కూడా ఇలా సాయంత్రం సమయంలో ఇంటి బయట కూర్చోకూడదని ఉంది.

చాలామంది పెద్దవాళ్ళు అనవసరంగా ఇలాంటివి చెప్తారని అనుకుంటూ ఉంటారు. కానీ, నిజానికి సాయంత్రం పూట ఇలా ఇంటి బయట కూర్చోవడం మంచిది కాదు. లక్ష్మీదేవి సాయంత్రం మన ఇంట్లోకి అడుగుపెడుతుంది. అలాంటప్పుడు మన ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలి. అందుకనే సాయంత్రం పూట ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోమని పెద్దలు అంటూ ఉంటారు.

సాయంత్రం పూట ఇంటి బయట కూర్చోవడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నట్లు అవుతుంది. అందుకని సాయంత్రం పూట ఎప్పుడూ కూడా ఇంటి బయట కూర్చోకూడదు. లక్ష్మీదేవి కనుక ఇంట్లోకి వచ్చిందంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రశాంతంగా ఉండొచ్చు. సంతోషం కూడా కలుగుతుంది. కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని అనుసరించడం మంచిది.

లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఈ తప్పులు కూడా చేయకండి:

తలుపుల్ని మూసి వేయకూడదు

సూర్యాస్తమయం తర్వాత ఇంటి తలుపుల్ని తెరిచి ఉంచాలి. ఇంటి తలుపుల్ని మూసి వేయకూడదు. ఇంటి ప్రధాన ద్వారాలు ఎట్టి పరిస్థితులను కూడా మూసి ఉంచకండి. సాయంత్రం లక్ష్మీదేవి వస్తుంది కనుక ఇంటి తలుపులు తెరిచి ఉండాలి. అప్పుడే అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

వెల్లుల్లి, ఉల్లి, సూదులు

సాయంత్రం పూట లక్ష్మీదేవి కలగాలంటే వెల్లుల్లి, ఉల్లిపాయల్ని ఎవరికీ ఇవ్వకండి. అలాగే వేరొకరి ఇంటి నుంచి సాయంత్రం పూట వెల్లుల్లి, ఉల్లి, సూదులు వంటివి తెచ్చుకోవద్దు. ఇవి సానుకూల శక్తిని తొలగించి, ప్రతికూల శక్తిని పెంచుతాయి. ఇలా తెచ్చుకోవడం దురదృష్టం అని కూడా పండితులు చెప్తున్నారు. ఈ పొరపాటు చేస్తే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కూడా పెరుగుతాయి.

తులసిని ముట్టుకోకూడదు

ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే, సాయంత్రం తులసిని ముట్టుకోకూడదు. సూర్యాస్తమయం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసిని తాకకూడదు.

ఆర్థిక లావాదేవీలు

సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఆర్థిక లావాదేవీలు జరపకూడదు. సూర్యాస్తమయం సమయంలో అప్పు కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే సూర్యాస్తమయం సమయంలో తులసి దగ్గర దీపం పెట్టాలి.

సంబంధిత కథనం