Amla Masala Chutney: ఉసిరికాయ మసాలా చట్నీ ఇలా చేశారంటే వేడి అన్నంలో అదిరిపోతుంది, రెసిపీ ఇదిగో
Amla Masala Chutney: ఉసిరికాయ చలికాలంలో దొరికే సీజనల్ ఆహారం. దీనితో చేసే రెసిపీలను కచ్చితంగా తినమని చెబుతూ ఉంటారు. ఉసిరికాయతో మసాలా చట్నీ రెసిపీ ఎలా ఇచ్చామో ఇక్కడ చెప్పాము. ఈ రెసిపీని ఎలా చేయాలో తెలుసుకోండి.
ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శీతాకాలంలో దీన్ని తినడం మంచిది. ఎందుకంటే ఇది అనేక ఆరోగ్య సమస్యల నుండి బయటపడేలా చేస్తుంది. ఉసిరికాయను తినడం వల్ల పిల్లలకు, పెద్దలకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఉసిరికాయలు చలికాలంలో కచ్చితంగా తినాలి. ఇప్పుడు ఉసిరికాయలు తక్కువ ధరకే ఎక్కువ లభిస్తాయి, కాబట్టి వాటితో నిల్వ పచ్చళ్లు చేసుకునేందుకు ప్రయత్నించండి. పిల్లలకు పెద్దలకు నచ్చే ఉసిరి మసాలా పచ్చడి చేసుకునేందుకు ప్రయత్నించండి. దీని రెసిపీ చాలా సులువు.
ఉసిరికాయ మసాలా పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
ఉసిరికాయలు - అర కిలో
నూనె - ఒక స్పూను
ఆవాలు - ఒక స్పూను
మెంతులు - పావు స్పూను
జీలకర్ర - అర స్పూను
సోంపు - అరస్పూను
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
బెల్లం తురుము - ఒక కప్పు
కారం - ఒక స్పూను
పసుపు - ఒక స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
బ్లాక్ సాల్ట్ - ఒక స్పూను
అల్లం తరుగు - ఒక స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
ఉసిరికాయ మసాలా పచ్చడి రెసిపీ
- ఉసిరికాయను ఒక గిన్నెలో వేయాలి. అందులో నీళ్లు వేసి మీడియం మంటపై ఆవిరిలో పావుగంట పాటూ ఉడికించాలి.
- ఉసిరి కాయ మెత్త బడ్డాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఉసిరికాయ గుజ్జును వేరు చేసి గింజలు పడేయాలి.
- ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి బాణలిలో ఒక స్పూన్ నూనె వేసి మెంతులు, జీలకర్ర, ఆవాలు, సోంపు గింజలు వేసి వేయించాలి.
- తర్వాత ఇక స్పూన్ కొత్తిమీర తరుగు వేసి కలపాలి.
- ఇప్పుడు ఉడికించిన ఉసిరికాయల ముక్కలను కూడా వేసి అయిదు నిమిషాలు బాగా వేయించాలి.
- తర్వాత అరకప్పు బెల్లం తురుము వేయాలి.
- బెల్లం కరిగి మిశ్రమం కొద్దిగా చిక్కబడే వరకు మీడియం మంట మీద ఉడికించాలి.
- మిశ్రమం చిక్కగా అయ్యాక తక్కువ మంట మీద ఉంచి కారం, పసుపు, ధనియాల పొడి, నల్ల ఉప్పు వేసి కలపాలి.
- ఇప్పుడు అందులో సన్నగా తరిగిన అల్లం వేయాలి. మిశ్రమం బాగా కలిపితే అయిదు నిమిషాలు ఉడికించాలి. తరువాత స్టవ్ కట్టేయాలి.
- అంతే ఉసిరికాయ పచ్చడి రెడీ అయినట్టే. ఇది రోటీ, పరోటా, అన్నంతో తింటే రుచి అదిరిపోతుంది.
ఉసిరికాయ ఉపయోగాలు
ఉసిరిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉసిరిని తినడం వల్ల శరీరానికి రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. ఇది అల్జీమర్స్, డిమెన్షియ వంటి రోగాలు రాకుండా ఉంటాయి. పిల్లలకు ఉసిరికాయ తినిపించడం వల్ల ఏకాగ్రత పెరిగి చదువు చక్కగా వస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచడంలో ఉసిరిలోని పోషకాలు ఉపయోగపడతాయి.