quiet quitting: ‘క్వైట్ క్విట్టింగ్.. బేర్ మినిమం మండే’.. ఏంటీ కొత్త ట్రెండ్స్?
క్వైట్ క్విట్టింగ్ (quiet quitting).. బేర్ మినిమం మండే (Bare Minimum Monday).. ఈ మధ్య కాలంలో ఉద్యోగుల్లో బాగా ట్రెండ్ అవుతున్న పదాలివి. ఇంతకీ ఈ పదాల అర్థం ఏంటి?.. ఎందుకింతగా ట్రెండ్ అవుతున్నాయి?
క్వైట్ క్విట్టింగ్ (quiet quitting).. బేర్ మినిమం మండే (Bare Minimum Monday).. ఈ రెండు పదాలు ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల పనితీరుపై ఇవి గణనీయ ప్రభావం చూపుతున్నాయి.
corona effects: కొరోనా తెచ్చిన మార్పులు..
కోవిడ్ 10 మహమ్మారి తో ఉద్యోగుల జీవన విధానంలో వచ్చిన మార్పుల ఫలితంగా ఈ ట్రెండ్స్ ప్రారంభమయ్యాయి. మొదట లాక్ డౌన్ (lock down), ఆ తరువాత వర్క్ ఫ్రం హోం (work from home), ఇప్పుడు హైబ్రిడ్ తరహాలో కొన్ని రోజులు వర్క్ ఫ్రం హోం (work from home), కొన్ని రోజులు వర్క్ ఫ్రం ఆఫీస్ (work from office).. ఇలా వివిధ పని విధానాలు ఉద్యోగిపై అదనపు ఒత్తడిని తీసుకువస్తున్నాయి. దాంతో, ఉద్యోగుల వ్యక్తిగత జీవనం, కుటుంబం, ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితుల్లో నుంచి క్వైట్ క్విటింగ్ (Quiet Quitting), బేర్ మినిమం మండే (Bare Minimum Monday), గ్రేట్ రిజిగ్నేషన్ (Great Resignation), రేజ్ అప్లైయింగ్ (Rage Applying) వంటి ట్రెండ్స్ పుట్టుకొచ్చాయి.
Bare Minimum Monday బేర్ మినిమం మండే అంటే..
ఇందులో బేర్ మినిమం మండే (Bare Minimum Monday) అంటే, వారాంతం ముగిసిన తరువాత.. సోమవారం ఉద్యోగానికి వెళ్లిన ఎంప్లాయి.. అత్యవసరమైన పనులను మాత్రం పూర్తి చేయడం. అనవసర ఎఫర్ట్స్ పెట్టకుండా, ఒత్తిడికి గురికాకుండా, ఆ రోజు కచ్చితంగా చేయాల్సిన పనులను మాత్రమే ముగించుకుని వెళ్లడాన్ని ‘బేర్ మినిమం మండే’గా (Bare Minimum Monday) పేర్కొంటున్నారు. ఉద్యోగ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా సమ ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో.. వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, ఉద్యోగ జీవితంలో అదనపు ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతో.. ఈ ట్రెండ్ ప్రారంభమైంది. బేర్ మినిమం మండే (Bare Minimum Monday) విధానంలో.. ఉద్యోగి సోమవారం రోజు విధులకు లేట్ గా రావడం, అత్యవసరమైన విధులను మాత్రం చేయడం, త్వరగా వెళ్లిపోవడం జరుగుతుంది. ఈ బేర్ మినిమం మండే (Bare Minimum Monday) పదాన్ని టిక్ టాకర్ మారిసా జో (Marisa Jo) కాయిన్ చేశారు. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా ఆమె అప్ లోడ్ చేశారు.
quiet quitting: క్వైట్ క్విట్టింగ్ అంటే..
క్వైట్ క్విటింగ్ (quiet quitting) కూడా దాదాపు బేర్ మినిమం మండే లాంటిదే. నిజానికి బేర్ మినిమం మండే కన్నా ముందు తెరపైకి వచ్చిన ట్రెండ్ క్వైట్ క్విటింగ్ (quiet quitting). ఈ విధానంలో కూడా ఉద్యోగులు తన ఉద్యోగానికి సంబంధించిన విధులను మాత్రమే పూర్తి చేస్తారు. అదనపు ఎఫర్ట్స్ ను, అదనపు ఒత్తిడిని తీసుకోరు. ఎక్కువ సమయం, ఎక్కువ ఎఫర్ట్, అత్యుత్సాహం చూపకుండా.. జాబ్ కు అవసరమైనంత మాత్రమే పని చేస్తారు. దీనివల్ల తమ పని తాము ఎక్కువ ఎఫర్ట్, ఎక్కువ ఒత్తిడి లేకుండా పూర్తి చేస్తారు. అంటే, తమ ప్రాథమిక విధులను మాత్రం పూర్తి చేస్తారు. క్వైట్ క్విటింగ్ (quiet quitting) ఉద్యోగుల తీరు ఎలా ఉంటుందో ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘‘నా పనేదో నేను చేసుకుంటా.. నా జీతమేదో నేను తీసుకుంటా’’ తరహా లో ఉంటుంది. యూఎస్ లో ఇది 2022 లో బాగా ట్రెండ్ అయింది. అమెరికా ఉద్యోగుల్లో దాదాపు సగం మంది క్వైట్ క్విటర్సేనని (quiet quitters) 2022 లో చేసిన ఒక సర్వే లో తేలడం విశేషం. అయితే, ఇది వర్క్ డిస్ సాటిస్ఫాక్షన్ (work dissatisfaction) కు మరో పేరనే వాదన కూడా ఉంది. క్వైట్ క్విటింగ్ (quiet quitting) అనే పదాన్ని బ్రయాన్ క్రీలీ అనే కార్పొరేట్ రిక్రూటర్ తొలి సారి వాడారు.