Vijay and Sangeetha divorce: విజయ్-సంగీత విడాకులు తీసుకోనున్నారా? ఇందులో నిజమెంత?
Vijay and Sangeetha divorce: తళపతి విజయ్ తన భార్య సంగీత నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపై క్లారిటీ వచ్చింది.
Vijay and Sangeetha divorce: తళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే విజయ్.. తన వ్యక్తిగత జీవితం గురించి కూడా పెద్దగా బయటకు చెప్పుకోడానికి ఇష్టపడరు. భార్య సంగీత కూడా బయటకు పెద్దగా రారు. అయితే సోషల్ మీడియా ప్రభావంతో ఏ చిన్న వార్త వచ్చినా ఇటీవల కాలంలో పెద్ద వైరల్ అవుతోంది. తాజాగా విజయ్ గురించి నెట్టింట ఓ వార్త హల్చల్ చేస్తోంది. విజయ్ తన భార్య సంగీత నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఫలితంగా సోషల్ మీడియాలో నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.
ఊహాగానాలపై క్లారిటీ..
వీరు నిజంగానే విడాకులు తీసుకుంటున్నారని చాలా మంది కామెంట్ల రూపంలో స్పందించారు. ఈ రూమర్ల దెబ్బతో విజయ్ వికిపీడియా పేజ్‌లో కూడా విజయ్ తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నాడని అప్డేట్ చేశారు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ఇవి వట్టి పుకార్లేనని తేలింది. విజయ్ సన్నిహితుల్లో ఒకరు ఈ పుకార్లపై స్పందించారు. విజయ్-సంగీత విడిపోతున్నారని వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని స్పందించారు. ఇలాంటి ఎలా మొదలవుతాయో అర్థం కావట్లేదని అన్నారు.
సంగీత వారిసు ఆడియో వేడుకకు హాజరు కాకపోవడంతో ఈ పుకార్లకు ఆజ్యం పోసినట్లయింది. విజయ్ భార్య తన పిల్లలతో కలిసి యూఎస్ హాలీడేలో ఉందని, ఆమె ఎలాంటి ఈవెంట్లకు హాజరు కాలేకపోయిందని తెలుస్తోంది. త్వరలో విజయ్ కూడా కుటుంబంతో కలవనున్నాడని అంటున్నారు. అయితే అధికారికంగా ఈ విషయంపై ధ్రువీకరణ రావాల్సి ఉంది.
విజయ్-సంగీత వివాహం..
విజయ్.. సంగీతను తొలిసారి 1996లో కలిశారు. సంగీత.. విజయ్‌కు పెద్ద అభిమాని. తన సినిమా షూటింగ్ సమయంలో సంగీతను కలిసిన అతడు ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. యూకేకు చెందిన సంగీత పూవే ఉనక్కగాలో అతడి నటనకు ఫిదా అయి.. భారత్ వచ్చి మరి కలిసింది. తనను చూడటానికి అంత దూరం నుంచి ఆమె రావడం నచ్చిన విజయ్.. అనంతరం తన కుటుంబాన్ని కూడా కలవమని అడిగాడు. వెంటనే ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించారు. తల్లిదండ్రులు కూడా వారి ప్రేమను అంగీకరించి పెళ్లికి అంగీకరించారు. ఈ జంట 1999 ఆగస్టు 25న వివాహం చేసుకుంది. హిందూ, క్రైస్తవ రెండు పద్ధతుల్లోనూ పెళ్లాడారు. ఆ తర్వాతి సంవత్సం కుమారుడు జాసన్ సంజయ జన్మించగా.. 2005లో కుమార్తే దివ్య సాషా పుట్టింది. ఇప్పటి వరకు 22 ఏళ్లుగా కలిసే ఉంటున్నారు.
ప్రస్తుతం విజయ్ నటించిన వారిసు సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మికా మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. ఖుష్బూ, ప్రకాశ్ రాజ్, ప్రభు, యోగి బాబు, శ్రీకాంత్, శరత్ కుమార్, జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల చేయనుంది చిత్రబృందం.
సంబంధిత కథనం