Varisu Trailer Released: విజయ్‌ వారిసు ట్రైలర్‌ వచ్చేసింది-varisu trailer released on wednesday that is on january 4th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Varisu Trailer Released: విజయ్‌ వారిసు ట్రైలర్‌ వచ్చేసింది

Varisu Trailer Released: విజయ్‌ వారిసు ట్రైలర్‌ వచ్చేసింది

Hari Prasad S HT Telugu
Jan 04, 2023 05:29 PM IST

Varisu Trailer Released: దళపతి విజయ్‌ నటించిన వారిసు ట్రైలర్‌ వచ్చేసింది. ఈ సినిమా జనవరి 12న రిలీజ్‌ కాబోతుండగా.. తాజాగా బుధవారం (జనవరి 4) వారసుడు తమిళ ట్రైలర్‌ రిలీజైంది.

వారిసు మూవీలో విజయ్
వారిసు మూవీలో విజయ్

Varisu Trailer Released: ఈ ఏడాది సంక్రాంతి సినిమాల్లో ఆసక్తి రేపుతున్నది తమిళ సూపర్‌ స్టార్‌ దళపతి విజయ్‌ నటించిన వారిసు. తెలుగులో వారసుడుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వాల్తేర్‌ వీరయ్య, వీర సింహా రెడ్డిలాంటి సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పోటీ పడనుంది. తాజాగా వారిసు తమిళ ట్రైలర్‌ను బుధవారం (జనవరి 4) మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.

విజయ్‌ ఫ్యాన్స్‌ ఊహించినట్లే అన్ని కమర్షియల్‌ హంగులతో ఈ ట్రైలర్‌ ఉంది. విజయ్‌ క్లాస్‌గా కనిపిస్తూనే మాస్‌ ఫైట్స్‌తో ఇరగదీశాడు. ఇక అతని మార్క్‌ డ్యాన్స్‌లతో పాటలూ అదుర్స్‌ అనేలా ఉన్నాయి. విజయ్‌ సరసన రష్మిక ఫిమేల్‌ లీడ్‌గా కనిపించింది. జయసుధ, ప్రకాశ్‌రాజ్‌, సుమన్, శ్రీకాంత్‌లాంటి టాలీవుడ్ స్టార్లతో కూడిన ఈ సినిమా తమిళంలో ఉన్న పక్కా తెలుగు మూవీగా కనిపిస్తోంది.

సన్‌ టీవీ యూట్యూబ్‌ ఛానెల్‌లో ఈ ట్రైలర్‌ రిలీజైంది. ఎంతోకాలంగా ఫ్యాన్స్‌ ఈ ట్రైలర్‌ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఇది రిలీజైన 20 నిమిషాల్లోనే రెండు మిలియన్లకుపైగా వ్యూస్‌ రావడం విశేషం. వారిసు మూవీ 2 గంటల 50 నిమిషాలతో సంక్రాంతి సినిమాల్లో అతిపెద్ద మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వంశీ పైడిపల్లి ఈ మూవీని డైరెక్ట్‌ చేయగా.. దిల్‌ రాజు ప్రొడ్యూస్‌ చేశాడు.

తెలుగు రాష్ట్రాల్లో అయితే వాల్తేర్‌ వీరయ్య, వీర సింహా రెడ్డి కంటే ఎక్కువ థియేటర్లలో వారసుడు రిలీజ్‌ కాబోతోంది. అయితే తమిళనాడులో మాత్రం అనుకున్న స్థాయిలో ఈ సినిమాకు థియేటర్లు దక్కలేదు. బీస్ట్‌ మూవీ బోల్తా పడిన తర్వాత వస్తున్న విజయ్ మూవీ కావడంతో వారిసు హిట్‌ కావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

IPL_Entry_Point