Suma Arrested: యాంకర్ సుమ అరెస్ట్.. వైరల్ అవుతున్న వీడియో
Suma Arrested: యాంకర్ సుమ అరెస్ట్ అయింది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో వైరల్ అవుతోంది. అసలు ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ వీడియోలో ఏముందో చూడండి.
Suma Arrested: యాంకర్ సుమను అరెస్ట్ చేశారు. పైన ఉన్న ఫొటో చూశారు కదా. ఆమె చేతిని బేడీలతో జీపుకు లాక్ చేశారు. నన్నెందుకు అరెస్ట్ చేశారని అడుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఆకలవుతోంది.. ఏమైనా తినడానికి ఇవ్వండి అన్నా కనికరించలేదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆ జీపులో ఆమె పక్కనే మరో వ్యక్తి కూర్చున్నాడు.
ఆ వ్యక్తి అసలు తనకేమీ తెలియదన్నట్లుగా అటూ ఇటూ చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? హీరో అల్లరి నరేష్. సుమను అరెస్ట్ చేస్తుంటే పక్కన నరేష్ ఉండటమేంటి? అతడు ఏమీ చేయకపోవడమేంటనేగా మీ డౌట్. ఎందుకంటే ఇదో ప్రమోషన్ స్టంట్ మరి. నరేష్ నటించిన ఉగ్రం సినిమా కోసం ఈ ఫన్నీ వీడియోను క్రియేట్ చేశారు.
అందులో సుమను అరెస్ట్ చేసి జీపులో తీసుకెళ్తుంటారు. పక్కనే నరేష్ సీరియస్ గా కూర్చొని ఉంటాడు. సుమ తనదైన రీతిలో సరదాగా ఏదో మాట్లాడుతూ ఉంటుంది. నన్నెందుకు అరెస్ట్ చేశారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆకలవుతోంది.. తినడానికి ఏమైనా ఇవ్వండి.. కొబ్బరి బోండాం అయినా తాగనిస్తారా అంటూ అరుస్తూ ఉన్నా.. నరేష్ ఏమీ పట్టనట్లు అలా ఉండిపోతాడు.
ఇంతకీ ఆమెను ఎందుకలా అరెస్ట్ చేశారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? దీనికి సంబంధించిన పూర్తి వీడియోను గురువారం (ఏప్రిల్ 13) ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేయనున్నారు ఉగ్రం మూవీ మేకర్స్. నాంది మూవీ తర్వాత అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కలిసి చేస్తున్న సినిమా ఉగ్రం. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ వీడియో చేశారు.
ఈ మధ్య కాలంలో ఎంత మంచి కంటెంట్ ఉన్నా కూడా ప్రమోషన్ సరిగా ఉంటేనే ప్రేక్షకులు చూస్తున్నారు. దీంతో మేకర్స్ వాళ్ల దృష్టిని ఆకర్షించడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఉగ్రం మేకర్స్ కూడా ఇలాంటి ఓ వెరైటీ వీడియోను రిలీజ్ చేశారు. ఉగ్రం మూవీ మే 5న రిలీజ్ కాబోతోంది.
సంబంధిత కథనం
టాపిక్