Allari Naresh on Ugram: నా కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రమిదే.. ఉగ్రం సినిమాపై నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు-allari naresh says ugram movie is highest budget movie in his career
Telugu News  /  Entertainment  /  Allari Naresh Says Ugram Movie Is Highest Budget Movie In His Career
ఉగ్రం టీమ్
ఉగ్రం టీమ్

Allari Naresh on Ugram: నా కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రమిదే.. ఉగ్రం సినిమాపై నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

19 March 2023, 19:01 ISTMaragani Govardhan
19 March 2023, 19:01 IST

Allari Naresh on Ugram: అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ఉగ్రం. నాంది చిత్రంతో సక్సెస్ అందించిన దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఉగ్రం అనే మరో సినిమా చేస్తున్నాడు నరేష్. ఈ సినిమా తన కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రమని స్పష్టం చేశారు.

Allari Naresh on Ugram: నాంది చిత్రంతో చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్ కమర్షియల్ హిట్ అందుకున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాతో నరేష్ సక్సెస్ రుచి చూశాడు. గతేడాది ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంతో సందడి చేసిన ఈ హీరో.. ఇప్పుడు మరో సరికొత్త సినిమాతో ముందుకు రానున్నాడు. అదే ఉగ్రం. నాంది లాంటి హిట్ అందించిన విజయ్ కనకమేడలో ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే అల్లరి నరేష్‌ను ఫెరోషియస్ పోలీస్‌ గా చూపించిన ఉగ్రం టీజర్‌‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ దేవేరి సాంగ్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. విన్న వెంటనే మనసుకు ఎంతగానో నచ్చేసే పాటిది. ట్యూన్, లిరిక్స్, కంపోజిషన్‌ మనసుల్ని ఆకట్టుకుంటాయి. శ్రీమణి సాహిత్యం ఆకట్టుకోగా అనురాగ్ కులకర్ణి మ్యాజికల్ వాయిస్ మరింత మాధుర్యాని తెచ్చాయి. అల్లరి నరేష్, మిర్నాల కెమిస్ట్రీ చక్కగా కుదిరింది.

సాంగ్ లాంచ్ ఈవెంట్ లో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. "ముందుగా ఆస్కార్ గెలుచుకొని దేశం పర్వపడేలా చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అభినందనలు. ప్రేక్షకులకు నచ్చితే అన్ని రకాల పాత్రలని చూస్తారు. ఉగ్రం సినిమాని చాలా ఇష్టపడి కష్టపడి చేశాం. దేవేరి పాట రాసిన శ్రీమణి గారికి పాడిన అనురాగ్ కులకర్ణి గారికి థాంక్స్. శ్రీ చరణ్ చాలా బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. విజయ్ మాస్టర్ చక్కని కొరియోగ్రఫీ చేశారు. నిర్మాత సాహు గారపాటి, హరీష్ పెద్ది గారి కృతజ్ఞతలు. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. నా కెరీర్ లో ఉగ్రం హయ్యెస్ట్ బడ్జెట్ ఫిల్మ్. సమ్మర్ లో ఉగ్రం మీ ముందుకు రాబోతుంది. నాంది సినిమాలాగే దీన్ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను." అని నరేష్ అన్నారు.

అల్లరి నరేష్ సరసన మిర్నా హీరోయిన్ గా చేసింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘ఉగ్రం’ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. తూమ్ వెంకట్ కథ అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. సిద్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు ఈ ఏడాది వేసవిలో ఉగ్రం థియేటర్లలో విడుదల కానుంది.

టాపిక్