Suma Kanakala Telugu Game Show: 3700 ఎపిసోడ్స్ - సుమ గేమ్ షో రికార్డ్‌ను బ్రేక్ చేయ‌డం క‌ష్ట‌మే-anchor suma kanakala star mahila is the second longest tv game show in india ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Anchor Suma Kanakala Star Mahila Is The Second Longest Tv Game Show In India

Suma Kanakala Telugu Game Show: 3700 ఎపిసోడ్స్ - సుమ గేమ్ షో రికార్డ్‌ను బ్రేక్ చేయ‌డం క‌ష్ట‌మే

Nelki Naresh Kumar HT Telugu
Mar 20, 2023 01:08 PM IST

Suma Kanakala Telugu Game Show: తెలుగులో నంబ‌ర్ వ‌న్ యాంక‌ర్‌గా కొన‌సాగుతోంది సుమ క‌న‌కాల‌. తెలుగులో ఆమె యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన ఓ గేమ్ షో 3700 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యింది. ఆ షో ఏదంటే...

సుమ క‌న‌కాల‌
సుమ క‌న‌కాల‌

Suma Kanakala Telugu Game Show: ప్ర‌స్తుతం తెలుగులో నంబ‌ర్ వ‌న్ యాంక‌ర్స్‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది సుమ క‌న‌కాల‌. ఓ వైపు టీవీ షోస్‌, మ‌రోవైపు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌, సెల‌బ్రిటీ ఇంట‌ర్వ్యూల‌తో ఇయ‌ర్ మొత్తం బిజీగా క‌నిపిస్తూనే ఉంటుంది సుమ‌. సుమ లేకుండా టాలీవుడ్‌లో భారీ సినిమాల ఈవెంట్స్‌ను ఊహించ‌డం క‌ష్ట‌మే అంటే అతిశ‌యోక్తి కాదు.

సుమ క‌న‌కాల యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న రియాలిటీ షోస్ ప‌ట్ల‌ తెలుగు ప్రేక్ష‌కుల్లో స్పెష‌ల్ క్రేజ్ ఉంది. త‌న కామెడీ టైమింగ్‌తో ప్ర‌తి షోను ఎంట‌ర్‌టైనింగ్‌గా మారుస్తుంటుంది సుమ‌. కాగా సుమ యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన స్టార్ మ‌హిళ గేమ్ షో రికార్డ్‌ను ఇప్ప‌టివ‌ర‌కు ఏ యాంక‌ర్‌ బ్రేక్ చేయ‌లేక‌పోయారు.

తెలుగులో అత్య‌ధిక కాలం ర‌న్ అయిన గేమ్‌షోగా స్టార్ మ‌హిళ రికార్డ్ క్రియేట్ చేసింది. 2007 జ‌న‌వ‌రి 1న ఈ గేమ్‌షో ఫ‌స్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. సుదీర్ఘంగా 3581 ఎపిసోడ్స్‌తో 2019లో ఫ‌స్ట్ సీజ‌న్‌ను ఎండ్ చేశారు. 2020లో సెకండ్ సీజ‌న్‌ను ప్రారంభించారు.

138 ఎపిసోడ్స్ త‌ర్వాత గ‌త ఏడాది సెకండ్ సీజ‌న్‌కు ముగింపు ప‌లికారు. మొత్తంగా ప‌ద‌మూడు ఏళ్ల పాటు 3719 ఎపిసోడ్స్‌తో తెలుగులో లాంగెస్ట్ గేమ్‌షోగా స్టార్ మ‌హిళ నిలిచింది. స్టార్ మ‌హిళ త‌ర్వాత మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు గేమ్ షో సెకండ్ హ‌య్యెస్ట్ ర‌న్నింగ్ తెలుగు గేమ్ షోగా నిలిచింది.

IPL_Entry_Point

టాపిక్