Today Rasi phalalu: నేటి రాశి ఫలాలు, ఈ రాశి వారి వ్యాపార విస్తరణ పనులు ఫలిస్తాయి-today december 5th rasi phalalu in telugu check zodiac signs horoscope predictions ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు, ఈ రాశి వారి వ్యాపార విస్తరణ పనులు ఫలిస్తాయి

Today Rasi phalalu: నేటి రాశి ఫలాలు, ఈ రాశి వారి వ్యాపార విస్తరణ పనులు ఫలిస్తాయి

HT Telugu Desk HT Telugu
Dec 05, 2024 03:05 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 5.12.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

డిసెంబర్ 5, నేటి రాశి ఫలాలు
డిసెంబర్ 5, నేటి రాశి ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 5.12.2024

ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ, మాసం: మార్గశిరం, వారం : గురువారం, తిథి: శు. చవితి, నక్షత్రం : ఉత్తరాషాఢ

మేష రాశి :

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పదు. వ్యాపారారులకు పెట్టుబడులు అందడంలో ఆలస్యం అవుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా లేదు. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. కొద్ది శ్రమతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడానికి దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి.

వృషభరాశి :

వృషభరాశి వారికి ఈరోజు ఇబ్బందులు ఎదురక్కోక తప్పదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు తప్పవు. వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటానికి విష్ణువు ఆలయాన్ని దర్శించండి. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.

మిథునరాశి :

మిథునరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. విలువైన వస్తువులను సేకరిస్తారు. గృహమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. మిథున రాశివారు మరింత శుభ ఫలితాలు పొందటానికి దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి.

కర్కాటకరాశి :

కర్కాటక రాశివారికి ఈరోజు అనుకూలగా లేదు. ఉద్యోగులకు స్థాన చలన మార్పులుంటాయి. ఆలయ దర్శనాలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఇంటా బయటా అకారణ వివాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. రుణదాత నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి విష్ణువు ఆలయాన్ని దర్శించండి. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.

సింహరాశి :

సింహరాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. సమాజంలో ప్రముఖ వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి. ధనపరంగా ఇబ్బందులు తొలగుతాయి. సింహ రాశివారు మరింత శుభ ఫలితాలు పొందటానికి దత్తాత్రేయ స్తోత్రాన్ని, విష్ణు సహస్రనామాలను పఠించండి.

కన్యారాశి :

కన్యారాశివారికి ఈరోజు అనుకూలంగా లేదు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. వృథా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. భూ వివాదాలు మానసికంగా చికాకులు కలిగిస్తాయి. కన్యా రాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి విష్ణువు ఆలయాన్ని దర్శించండి. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.

తులారాశి :

తులారాశి వారికి ఈరోజు మీకు అనుకూలిస్తాయి. నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో చక్కగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. తులా రాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి.

వృశ్చికరాశి :

వృశ్చిక రాశివారికి ఈరోజు బాగా కలిసి వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వృశ్చిక రాశివారు మరింత శుభ ఫలితాలు పొందటానికి విష్ణువు ఆలయాన్ని దర్శించండి. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.

ధనస్సు రాశి :

ధనస్సు రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. వ్యాపారాలలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగాలలో స్థాన చలన సూచనలున్నాయి. ఈరోజు కుటుంబ సమస్యలు చికాకుపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. స్నేహితులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ధనూరాశివారు మరింత శుభ ఫలితాలు పొందటానికి దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి.

మకరరాశి :

మకరరాశి వారికి ఈరోజు అనుకూలంగానే ఉంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తప్పవు. స్థిరాస్తి విషయమై సోదరులతో వివాదాలు కలుగుతాయి. మకర రాశివారు మరింత శుభ ఫలితాలు పొందటానికి విష్ణువు ఆలయాన్ని దర్శించండి. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.

కుంభరాశి :

కుంభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుంభ రాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి.

మీనరాశి :

మీనరాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. నిరుద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు పొందుతారు. మీన రాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి విష్ణువు ఆలయాన్ని దర్శించండి. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.

Whats_app_banner