Indira Ekadashi: ఇందిరా ఏకాదశి రోజు విష్ణువు ఆశీర్వాదాలు పొందటం కోసం ఈ మంత్రాలు పఠించండి-chant these mantras of shri hari vishnu on the day of indira ekadashi ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Indira Ekadashi: ఇందిరా ఏకాదశి రోజు విష్ణువు ఆశీర్వాదాలు పొందటం కోసం ఈ మంత్రాలు పఠించండి

Indira Ekadashi: ఇందిరా ఏకాదశి రోజు విష్ణువు ఆశీర్వాదాలు పొందటం కోసం ఈ మంత్రాలు పఠించండి

Gunti Soundarya HT Telugu
Sep 27, 2024 04:00 PM IST

Indira Ekadashi: పితృ పక్షంలో ఇందిరా ఏకాదశి నాడు ఉపవాసం చేయడం పూర్వీకుల శాంతికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి, పూజతో పాటు ప్రత్యేక మంత్రాలను జపించడం వల్ల స్వామి వారి ఆశీస్సులు లభిస్తాయి.

ఇందిరా ఏకాదశి రోజు పఠించాల్సిన మంత్రాలు
ఇందిరా ఏకాదశి రోజు పఠించాల్సిన మంత్రాలు

Indira Ekadashi: హిందూ మతంలో విష్ణువు ఆరాధనకు ఏకాదశి తేదీకి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెల శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ రోజున పూజలు, ఉపవాసం చేసి విష్ణువు అనుగ్రహం పొందుతారు.

భాద్రపద మాసంలో వచ్చే చివరి ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు. ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు, పూర్వీకులు కూడా మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. దృక్ పంచాంగ్ ప్రకారం ఇందిరా ఏకాదశి వ్రతం 28 సెప్టెంబర్ 2024న పాటించనున్నారు. ఏకాదశి వ్రతంలో ప్రపంచాన్ని పోషించే శ్రీమహావిష్ణువును ఆరాధించడం ద్వారా జీవితంలోని అన్ని దుఃఖాల నుండి విముక్తి పొంది సంపద, శ్రేయస్సును పొందుతాడు.

ఇందిరా ఏకాదశి పూజ ముహూర్తం

సెప్టెంబర్ 28 ఉదయం 7.41 గంటల నుంచి 9.11 గంటల వరకు ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 1.40 గంటల నుంచి 3.10 గంటల వరకు పూజకు సమయం ఉంటుంది. సూర్యోదయం తర్వాత ఏకాదశి ఉపవాసం పాటించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఈ రోజున శ్రీమహావిష్ణువు శాలిగ్రామ రూపాన్ని ఆరాధించడం, ప్రత్యేక మంత్రాలను పఠించడం చాలా పవిత్రమైనది, ఫలవంతమైనదిగా పరిగణిస్తారు. ఇందిరా ఏకాదశి రోజు మీరు కూడా సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ఈ మంత్రాలను పఠించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. విష్ణువు సాధారణ మంత్రాలను తెలుసుకుందాం...

విష్ణువు సాధారణ మంత్రాలు

1.ఓం నమో భగవతే వాసుదేవాయ

2.శ్రీ కృష్ణ గోవింద్ హరే మురారే.

ఓ నాథ్ నారాయణ్ వాసుదేవయ్.

3. ఓం విష్ణవే నమః

4. ఓం అం వాసుదేవాయ నమః

5. ఓం ప్రద్యుమ్నాయ నమః

6. ఓం నారాయణాయ నమః

7. ఓం అనిరుద్ధాయ నమః

8. ఓం హూఁ విష్ణవే నమః

9. ఓం నమో నారాయణ. శ్రీ మన్ నారాయణ్ నారాయణ హరి హరి.

10. ఓం అనిరుద్ధాయ నమః

ఇది కాకుండా ఇందిరా ఏకాదశి రోజున విష్ణు సహస్ర నామాన్ని పఠించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీనివల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు. జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజున భజన, కీర్తనలు చేయడం వల్ల కూడా పుణ్యఫలితాలు లభిస్తాయి.

ఇందిరా ఏకాదశి రోజు శాలిగ్రామాన్ని సక్రమంగా పూజించాలి. ఇలా చేయడం వల్ల సంపద, ధాన్యాలు పెరిగి పితృ దేవతలు సంతోషంగా ఉంటారు. ఈరోజున ఉపవాసం ఉండి పితృ దేవతలకు అన్నాదానం చేసి బ్రహ్మణులకు దక్షిణ ఇవ్వాలి. ఇలా చేస్తే సంపద రెట్టింపు అవుతుంది. కుటుంబంలో సమస్యలు తొలగి సంతోషంగా ఉంటారు. ఈ ఏకాదశి నాడు మీరు చేసే ఎ దానధర్మాలు అయినా దాని ఫలితం పితృదేవతలకే దక్కుతుంది. అందుకే ఈ ఏకాదశిని మోక్షదాయని ఏకాదశిగా భావిస్తారు.

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

Whats_app_banner

టాపిక్