Powerful mantralu: ఇతరుల దిష్టి మీకు తగలకూడదనుకుంటే ప్రతిరోజూ ఈ మంత్రాలను జపించండి
Powerful mantralu: చెడు ఉద్దేశంతో చూసే నరుల దృష్టి అసలు మంచిది కాదు. ఇది జీవితాన్ని చిక్కుల్లో పడేస్తుంది. అటువంటి చెడు దృష్టి నుంచి తప్పించుకునేందుకు, మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు ప్రతి రోజు కొన్ని మంత్రాలు పఠించడం ముఖ్యం. అవి ఏంటి వాటిని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
Powerful mantralu: నరుల దృష్టికి నాపరాళ్ళు కూడా పగులుతాయని అంటారు. ఒక వ్యక్తి ఎదుటి వారిని చూసి అసూయ పడితే అది వారికి చాలా నష్టాన్ని మిగులుస్తుంది. దీన్ని ఒక రకంగా దిష్టి అని కూడా అంటారు. చెడు కన్ను పడితే దాని నుంచి బయటపడటం ఒకరకంగా కష్టంగా ఉంటుంది.
చెడు దృష్టి కుటుంబంలో సమస్యలు ఏర్పడటం, మానసిక ఒత్తిడి వంటివి తలెత్తుతాయి. బ్లాక్ మ్యాజిక్, నరదిష్టి అనేవి చాలా ప్రభావవంతంగా ఉంటాయని పెద్దలు చెబుతూ ఉంటారు. కొందరు ఎదుటి వారి ఎదుగుదలను ఓర్చుకోలేక చేతబడి వంటివి చేయిస్తూ ఉంటారు. ప్రతికూల శక్తులను నుంచి బయట పడేందుకు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి వల్ల ప్రభావితం కాకుండా ఉండేందుకు సహాయపడే కొన్ని మంత్రాలు ఉన్నాయి. చేతబడి, చెడు కన్ను నుంచి మిమ్మల్ని రక్షించేందుకు ఉపయోగపడే కొన్ని మంత్రాలు ఇవి. వీటిని నిత్యం పఠిస్తూ ఉండటం మంచిది.
ఓం నమః శివాయ
శివునికి అంకితం చేసిన అత్యంత సులభమైన, శక్తివంతమైన మంత్రాలలో ఒకటి ఓం నమః శివాయ. శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. శివుని చేతికి మనల్ని అప్పగించుకోవడం వల్ల ఏదైన చేతబడి లేదా చెడు కన్ను నుంచి మనల్ని ఆ శివయ్యే కాపాడతాడు. శివుడు ఆదియోగి, అత్యున్నత తపస్వి, సర్వశక్తిమంతుడు. తన భక్తులు శరణు కోరి వస్తే తప్పకుండా కాపాడతాడు. మీరు ఏదైనా ప్రతికూల శక్తుల వల్ల ఇబ్బందులు పడుతున్నట్టయితే ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ గదిలో కూర్చోవాలి. గట్టిగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. దీపం వెలిగించాలి.
మహామృత్యుంజయ మంత్రం
మహా మృత్యుంజయ మంత్రం అనేది శివుని మరొక అత్యంత శక్తివంతమైన మంత్రం. ఇది చెడు శక్తులు, చెడు కన్ను, చేతబడి నుండి దూరంగా ఉండటానికి సహాయపడుతుంది. మహామృత్యుంజయ మంత్రాన్ని 'మృత్యువు జయించే' మంత్రం అని కూడా పిలుస్తారు. అనారోగ్యం, చెడు, మరణ భయం నుంచి బయటపడేందుకు ప్రాచీన కాలం నుంచి జపిస్తూ వస్తున్నారు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ గదిలో కూర్చున్నప్పుడు లేదా పడుకునే ముందు మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించండి.
ఓం హ్రౌం జూం సః
ఓం హ్రౌం జూమ్ సాః' అనే మంత్రం మహామృత్యుంజయ బీజ మంత్రంగా పిలుస్తారు. ఇది చాలా శక్తివంతమైనది. విశ్వం ఆదిమ ధ్వని ఓం తో ప్రారంభమవుతుంది. ఈ మంత్రంలోని హ్రౌమ్ అన్ని ప్రతికూలతలను, అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. జూం చెడుకు వ్యతిరేకంగా రక్షణ కవచంగా పనిచేస్తుంది. సా అనేది జపించేవారి చుట్టూ ఉన్న రక్షణను ఏర్పరుస్తుంది.
ఓం వజ్రపాణి హమ్ ఫట్
ఓం వజ్రపాణి హమ్ ఫట్ అనేది బౌద్ధ సంప్రదాయాల నుండి వచ్చిన మంత్రం. అన్ని బుద్ధుల శక్తిని సూచించే బోధిసత్వుడైన వజ్రపాణితో ముడిపడి ఉంది. అతను అందరికీ రక్షకుడిగా ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు. చేతిలో వజ్రం పట్టుకుని ఉండే అతని కళ్ళు శక్తి భావాన్ని చూపుతాయి. చెడు శక్తులపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు అతని రూపు ఉంటుంది. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల చేతబడి, నరదిష్టి వంటి వాటితో పోరాడేందుకు సహాయపడుతుంది.
ఓం రుద్రాభి ద్రవ హో
ఇది రుద్రుని ఉగ్ర రూపానికి అంకితం చేసింది. కష్ట సమయాల్లో సహాయం చేయమని భగవంతుడిని వేడుకోవడం దీని అర్థం. గర్భిణీ స్త్రీలు చెడు శక్తుల నుంచి రక్షించేందుకు వారి లోపల పెరుగుతున్న జీవాన్ని రక్షించుకోవడం కోసం కనీసం 108 సార్లు ఈ మంత్రాన్ని జపించడం మంచిది.
విష్ణు మంత్రం
ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థం గతో’పి వా
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః
ఈ మంత్రం శుద్ధీకరణ శ్లోకం లాంటిది. చెడు శక్తుల నుంచి ప్రజలను రక్షించడంలో సహాయపడుతుంది. ధ్యానం చేసేటప్పుడు, పూజ ఆచారాలు ప్రారంభించే ముందు పఠించవచ్చు. ఇది పఠించడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తులు ఏర్పడతాయి.